గాంధీ ఆస్పత్రి నుంచి నలుగురు ఖైదీలు పరారీ

27 Aug, 2020 12:28 IST|Sakshi

ఆస్పత్రి ప్రాంగణంలో పని చేయని సీసీ కెమెరాలు

ఇంకా దొరకని ఆచూకీ 

సాక్షి, హైదరాబాద్‌: సికింద్రాబాద్‌ గాంధీ ఆస్పత్రి నుంచి కరోనా సోకిన నలుగురు ఖైదీలు పరారయ్యారు. ఆస్పత్రి ప్రిజనర్స్‌ వార్డు బాత్‌రూం కిటికీ గ్రిల్స్‌ తొలగించి బెడ్‌షీట్‌ను తాడుగా ఉపయోగించి.. ఆస్పత్రి వెనుక వైపు గల గేటు దూకి వీరు పరారైనట్లు సమాచారం. గాంధీ ఆస్పత్రి ప్రధాన భవనం రెండో అంతస్తులో ఉన్న ఖైదీల వార్డులో కరోనా సోకిన 19 మందికి వైద్యం అందిస్తున్నారు. వారిలో చంచల్‌గూడ, చర్లపల్లి జైళ్లకు చెందిన ఖైదీలు అబ్దుల్‌ అర్బాజ్‌ (21), సోమసుందర్‌ (20), మహ్మద్‌ జావీద్‌ (35), పార్వతీపురం నర్సయ్య (32)లను బుధవారం పోలీసులు చేర్చారు. గురువారం చేపట్టిన తనిఖీల్లో నలుగురు ఖైదీలు తక్కువగా ఉండటంతో అన్ని వార్డుల్లో గాలించారు. ప్రిజనర్స్‌ వార్డు బాత్‌రూం కిటికీ గ్రిల్స్‌ తొలగించి ఉండడంతో ఈ నలుగురు ఖైదీలు పరారైనట్లు నిర్ధారణకు వచ్చినట్లు ఉన్నతాధికారులకు తెలిపారు. ఆస్పత్రి ప్రాంగణంలోని చాలా సీసీ కెమెరాలు పనిచేయకపోవడంతో ఖైదీల పరారీపై పోలీసులు స్పష్టమైన అవగాహనకు రాలేకపోతున్నట్లు తెలిసింది. 

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు