మనుషులే కాదు.. ఆత్మలు ఉపాధి హామీ పనికి..

4 Aug, 2021 14:53 IST|Sakshi

సాక్షి, పెద్దకొడప్‌గల్‌(నిజామాబాద్‌): మనుషులే కాదు.. ఆత్మలు కూడా ఉపాధి పనికి వస్తున్నాయట..! చేసిన పనికి డబ్బులు కూడా తీసుకుంటున్నాయట!! ఉపాధి హామీ సామాజిక తనిఖీలో ఈ విషయం వెలుగు చూసింది. అంతే కాదు.. పోలీసు కానిస్టేబుళ్లు, వీఆర్‌ఏలు కూడా ఉపాధి పనినే నమ్ముకున్నారట. పెళ్లయి అత్తారింటికి వెళ్లిన యువతులు కూడా పుట్టింటికి వచ్చి ఉపాధి పనులు చేస్తున్నారట. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో జరుగుతున్న అక్రమాలకు ఇవే ఉదాహరణ. పెద్దకొడప్‌గల్‌ మండల కేంద్రంలో మంగళవారం నిర్వహింన ఉపాధి హామీ సామాజిక తనిఖీ ప్రజావేదికలో విస్తుగొలిపే అంశాలు బయటడపడ్డాయి.

పెద్దదేవిసింగ్‌ తండా, చిన్నదేవిసింగ్‌ తండా, వడ్లం గ్రామాల పరిధిలో మూడేళ్లలో జరిగిన ఉపాధి పనుల్లో జరిగిన అక్రమాలు ఈ సందర్భంగా వెలుగులో కి వచ్చాయి. కొన్ని మాస్టర్లలో సంతకాలు లేకుండానే డబ్బులు చెల్లింనట్లు తేలింది. వీఆర్‌ఏ ఆనంద్‌కూమర్‌తో పాటు పోలీస్‌ కానిస్టేబుళ్లు ఉపాధి పనికి వచ్చి డబ్బులు తీసుకు న్నట్లు నమోదు చేశారని తనిఖీ బృందం తే ల్చింది. అంతే కాదు, పెళ్లయి అత్తారింటికి వెళ్లి పోయిన వారి పేర్లతో పాటు చనిపోయిన వారి పేర్ల పేరిట డబ్బులు చెల్లింనట్లు తనిఖీ బృందాలు గుర్తించాయి. ఒకే వర్క్‌ ఐడీపై రెండుసార్లు డబ్బులు చెల్లింనట్లు తేల్చాయి.

విఠల్‌ అనే వ్యక్తి పని చేయక పోయినా 67 రోజులకు గాను ర.11,346 చెల్లించారని, ఇందులో సగం ఫిల్డ్‌ అసిస్టెంట్‌ చందర్‌ తీసుకున్నారని సావజిక తనిఖీలో తేలింది. మంకీ ఫుడ్‌ కోర్టు ఒక్కటే నిర్వహించగా, రెండు చూపి డబ్బులు చెల్లింనట్లు గుర్తించారు. ఇక వడ్లం గ్రామంలోని ప్రతి పనిలోనూ అక్రమాలు జరిగాయని తనిఖీ బృందాలు తేల్చాయి. రైతులు సొంత ఖర్చులతో వేసుకున్న రోడ్లను ఉపాధి హామీలో నిర్మింనట్లు చూపి ర.20,54,000 కాజేసినట్లు తేలింది. అధికారులు వెంకటవధవరావు, శ్రీకాంత్, సాయన్న, దత్తకొండ, అశోక్‌కూమార్, ఎంపీపీ ప్రతాప్‌రెడ్డి, ఎంపీడీవో రాణి, సిబ్బంది పాల్గొన్నారు.
 
   

మరిన్ని వార్తలు