22 నుంచి పోలీసు ఉద్యోగాలకు ఉచిత శిక్షణ 

19 Sep, 2021 04:58 IST|Sakshi

ఆన్‌లైన్, ఆఫ్‌లైన్‌ పద్ధతుల్లో అందించనున్న బీసీ స్టడీ సర్కిల్‌ 

సాక్షి, హైదరాబాద్‌: సబ్‌ఇన్‌స్పెక్టర్, కానిస్టేబుల్‌ ఉద్యోగాలకు సన్నద్ధమవుతున్న నిరుద్యోగ యువతకు బీసీ స్టడీసర్కిల్‌ ద్వారా ఉచిత శిక్షణ ఇస్తున్నట్లు బీసీ సంక్షేమ శాఖ శనివారం ఓ ప్రకటనలో తెలిపింది. కోవిడ్‌–19 నేపథ్యంలో ఆన్‌లైన్, ఆఫ్‌లైన్‌ పద్ధతుల్లో శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు పేర్కొంది.

రాష్ట్ర వ్యాప్తంగా 11 స్టడీ సర్కిళ్లలో ఈ నెల 22వ తేదీ నుంచి శిక్షణ ప్రారంభించనున్నట్లు బీసీ స్టడీసర్కిల్‌ డైరెక్టర్‌ బాలాచారి వివరించారు. జనరల్‌ స్టడీస్, అర్థమెటిక్, రీజనింగ్, ఇంగ్లిష్‌ తదితర అంశాల్లో 60 రోజుల పాటు శిక్షణ సాగుతుందన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 15,622 మంది దరఖాస్తు చేసుకున్నారని, వారిని బ్యాచ్‌లుగా విభజించి కోచింగ్‌ ఇస్తామని చెప్పారు. దీంతోపాటు తెలంగాణ బీసీ స్టడీ సర్కిల్‌ యూట్యూబ్‌ చానల్‌ ద్వారా ఆన్‌లైన్‌ తరగతులు వీక్షించవచ్చని వెల్లడించారు.  

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు