కరోనా బాధితులకు గుడ్‌ న్యూస్‌: ఫోన్‌ కొడితే.. ఇంటి వద్దకే..

29 Apr, 2021 11:22 IST|Sakshi
ప్రతీకాత్మకచిత్రం

సాక్షి, బంజారాహిల్స్‌: కరోనా పాజిటివ్‌ బాధితులకు ఎలాంటి డెలివరీ చార్జీలు లేకుండా సరుకులు సరఫరా చేసేందుకు కౌన్సిల్‌ ఫర్‌ ట్రాన్స్‌ఫార్మింగ్‌ ఇండియా(సీటీఐ) అనుబంధ ‘ది హైదరాబాద్‌ ఎసెన్షియల్స్‌ డెలివరి కలెక్టివ్‌’ అనే సంస్థ ముందుకొచ్చింది. కరోనా సోకిన వారు తమకు ఫోన్‌ చేస్తే వారు కోరుకున్న సరుకులను ఇంటి వద్దకు చేరుస్తామని ప్రతినిధులు  ప్రకటించారు.

కొనుగోలు చేసిన సరుకులకు మాత్రమే డబ్బులు చెల్లించాల్సి ఉంటుందని, తామంతా వారి ఇళ్ల వద్దకు వెళ్లి బ్యాగులు ఇంటి ముందు పెడతామని సంస్థ వ్యవస్థాపకుడు రోహిత్‌ వక్రాల వెల్లడించారు. తమకు ఇప్పటికే 37 మంది వలంటీర్లు నగర వ్యాప్తంగా ఉన్నారని, ప్రతిరోజూ 70 మందికి ఈ సరుకుల పంపిణీ చేస్తున్నట్లు ఆయన వెల్లడించారు. 8340903849 నంబర్‌కు ఫోన్‌ చేస్తే సరుకుల జాబితాను తీసుకొని అరగంటలో ఇంటి ముందు ఆ బ్యాగును ఉంచుతామని ఆయన వెల్లడించారు.   

మరిన్ని వార్తలు