పాతబస్తీలో ఉచిత పార్కింగ్‌ సౌకర్యం

25 Apr, 2022 06:48 IST|Sakshi
పంచమొహల్లాలో ఏర్పాటు చేసిన ఉచిత పార్కింగ్‌ సౌకర్యం

చార్మినార్‌: పాతబస్తీలో ఓవైపు పర్యాటకులు..మరోవైపు రంజాన్‌ షాపింగ్‌ రద్దీతో వీధులన్నీ కిక్కిరిసిపోతున్నాయి. రాకపోకలకు సైతం ఇబ్బంది కలుగుతోంది. ఈ నేపథ్యంలో వాహనాల పార్కింగ్‌ మరింత క్లిష్టంగా మారగా... ట్రాఫిక్‌ పోలీసులు స్పందించి ఉచితంగా పార్కింగ్‌ సౌకర్యాన్ని అందుబాటులోకి తెచ్చారు.  
రంజాన్‌ మాసంలో చివరి పది–పన్నెండు రోజులు పాతబస్తీలోని మార్కెట్లు రద్దీగా మారుతాయి. ముఖ్యంగా చార్మినార్‌ ప్రాంతం కిటకిటలాడుతుంది. 
► అలాగే మక్కా మసీదులో ప్రతి రోజు నిర్వహించే ఐదు నమాజ్‌లకు ముస్లింలు ఇతర ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున తరలి వస్తారు. 
► దీనిని దృష్టిలో పెట్టుకొని నగర ట్రాఫిక్‌ ఉన్నతాధి కారులు తాత్కాలిక పార్కింగ్‌ సౌకర్యాన్ని అందుబాటులోకి తెచ్చారు. 

పార్కింగ్‌ సౌకర్యం కల్పించిన ప్రాంతాలివే.. 
చార్మినార్‌ సమీపంలో.. 
► యునానీ ఆసుపత్రి ప్రాంగణం  
► కుడా స్టేడియం 
► మోతీగల్లీ పెన్షన్‌ ఆఫీసు 
 కోట్ల అలీజాలోని ముఫిదుల్లానామ్‌ హైస్కూల్‌ ప్రాంగణం 
పంచమొహల్లాలోని కూలగొట్టిన  ఆర్టీసీ బస్టాండ్‌ ఖాళీ స్థలం 

పార్కింగ్‌ ఉచితమే.. 
రంజాన్‌ మాసంలోని చివరి పది–పన్నెండు రోజులు ఎంతో కీలకం. పాతబస్తీ రద్దీగా మారుతుంది. దీన్ని దృష్టిలో పెట్టుకుని సమీపంలోని ఆరు ప్రాంతాల్లో వాహనదారుల కోసం ఉచిత పార్కింగ్‌ సౌకర్యం ఏర్పాటు చేశౠం. ఇక్కడ పార్కింగ్‌ ఉచితం. ఎలాంటి డబ్బులు వసూలు చేయరు. ఎవరైనా డబ్బులు వసూలు చేస్తే..మా దృష్టికి తీసుకువస్తే చర్యలు తీసుకుంటాం. – శ్రీనివాస్‌రెడ్డి, దక్షిణ మండలం ట్రాఫిక్‌ ఏసీపీ 

మరిన్ని వార్తలు