తెలంగాణ బడ్జెట్: ఏ శాఖకు ఎన్ని నిధులు...

19 Mar, 2021 08:52 IST|Sakshi

కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్‌తో పేదలకు లబ్ధి
బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీల్లోని పేదింటి ఆడపిల్లల పెళ్లిళ్లకు ప్రభుత్వం కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్‌ కింద అందిస్తున్న సాయం ఎంతో ఉపయోగపడుతోందని సామాజిక ఆర్థిక సర్వే వెల్లడించింది. 2014–15 నుంచి 2020–21 మధ్య ఎస్సీల్లో 1.64 లక్షల మందికి ప్రభుత్వం రూ.1,235 కోట్లు అందచేసింది. అలాగే గిరిజనుల్లో లక్ష మంది వరకు లబ్ధి పొందగా వారికి రూ. 764 కోట్లు పంపిణీ చేసింది. ఇక బీసీల్లో  2.98 లక్షల మంది కల్యాణ లక్ష్మి పథకం కింద లబ్ధి పొందగా.. వీరికి రూ.2,752 కోట్ల ఆర్థిక సాయాన్ని అందించింది. ఇక షాదీ ముబారక్‌ పథకం కింద మైనారిటీల్లో 1.68 లక్షల మందికి లబ్ధి చేకూరగా రూ.1,112 కోట్లను ప్రభుత్వం వారికి ఆర్థిక సాయంగా అందించింది. 

పెరుగుతున్న పట్టణ జనాభా
పట్టణాల్లో మౌలిక సదుపాయల కల్పన, ఉద్యోగ అవకాశాలు ఉండడంతో పట్టణ జనాభా పెరుగుతున్నట్లు సామాజిక ఆర్థిక సర్వే తెలిపింది. నగరాల్లో ప్రస్తుతం 46.1 శాతం ఉన్న జనాభా 2036 నాటికి 57.3 శాతం వరకు పెరుగుతుందని రాష్ట్ర ప్రభుత్వం అంచనా వేసింది. ఇది జాతీయ సగటుతో పోలిస్తే దాదాపు 18 శాతం అధికంగా ఉంటుందని సామాజిక ఆర్థిక సర్వే వెల్లడించింది. 2011లో పట్టణ జనాభా 28.9 శాతం ఉంటే.. ఇప్పుడది 46.1 శాతానికి పెరిగింది. ఇదే సమయంలో జాతీయ స్థాయిలో 31.1 శాతం నుంచి 34.5 శాతానికి పెరిగింది. గ్రామాల నుంచి ఉపాధి కోసం పట్టణాలకు వస్తున్న వారు పెరుగుతున్నట్లు స్పష్టమవుతోందని సర్వే పేర్కొంది. రాష్ట్ర జనాభా ప్రస్తుతం
3.8 కోట్ల వరకు ఉంటే అందులో 2 కోట్లకుపైగా జనాభా గ్రామీణ ప్రాంతాల్లోనే నివసిస్తున్నట్లు వెల్లడించింది.
 

పంచాయతీ రాజ్‌ గ్రామీణాభివృద్ధి శాఖ రూ. 29,271కోట్లు
ఐటీ రూ. 360  కోట్లు
వైద్య, ఆరోగ్య శాఖ రూ.  6,295కోట్లు
మహిళా,శిశు సంక్షేమం రూ.  1,632కోట్లు
రోడ్లు, భవనాలు రూ. 8,788కోట్లు
పశుసంవర్థక,మత్స్య శాఖ రూ. 1,730కోట్లు
వ్యవసాయం రూ. 25,000కోట్లు
పాఠశాల విద్య రూ. 11,735కోట్లు
ఉన్నత విద్య రూ. 1,873కోట్లు
విద్యుత్‌ రూ. 11,046కోట్లు
హోం శాఖ రూ. 6,465కోట్లు
అటవీ శాఖ రూ. 1,276కోట్లు
బీసీ సంక్షేమ శాఖ రూ. 5,522కోట్లు
మైనారిటీ సంక్షేమం రూ. 1,606కోట్లు
ఎస్సీల ప్రత్యేక అభివృద్ధి నిధి రూ. 21,306కోట్లు
ఎస్టీల ప్రత్యేక అభివృద్ధి నిధి రూ. 12,304కోట్లు
సాంస్కృతిక, పర్యాటక శాఖ రూ. 726కోట్లు
సాగునీటి రంగం రూ. 16,931కోట్లు
పరిశ్రమలు  రూ. 3,077కోట్లు
పౌర సరఫరాలు  రూ. 2,363కోట్లు
పురపాలిక, పట్టణాభివృద్ధి శాఖ రూ. 15,030కోట్లు

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు