బస్సు ప్రమాద మృతులకు అంత్యక్రియలు

5 Jun, 2022 07:57 IST|Sakshi

సుల్తాన్‌బజార్‌: నగరంలోని గోడేకబర్‌ నుంచి గోవాకు వెళ్లి తిరుగు ప్రయాణంలో బస్సు ప్రమాదంలో మృతిచెందిన శివకుమార్, రవళి, దీక్షిత్‌ల మృతదేహాలు పోస్టుమార్టం అనంతరం శనివారం ఉదయం 11 గంటలకు గోడేకబర్‌ కామటిపురాలోని వారి ఇళ్లకు చేరుకున్నాయి. దీంతో గోడేకబర్‌ పరిసర ప్రాంతాల్లో విషాదం అలముకుంది. గోషామహల్‌ ఎమ్మెల్యే రాజాసింగ్, మాజీ ఎమ్మెల్యే ప్రేమ్‌సింగ్‌ రాథోడ్, రాజ్యసభ సభ్యుడు రవిచంద్ర, స్థానిక కార్పొరేటర్‌ లాల్‌సింగ్, మాజీ కార్పొరేటర్‌ ముఖేష్‌ సింగ్‌లు మృతదేహాలను సందర్శించి నివాళులర్పించారు. అనంతరం మధ్యాహ్నం పురానాపూల్‌ శ్మశాన వాటికలో అంత్యక్రియలు నిర్వహించారు.  

(చదవండి: కాన్పూర్‌ హింస..800 మందిపై కేసులు)
 

మరిన్ని వార్తలు