దేశంలోనే అతిపెద్ద పండ్ల మార్కెట్‌: నాడు అలా, నేడు ఇలా!

30 Sep, 2021 10:59 IST|Sakshi
గడ్డిఅన్నారం పండ్ల మార్కెట్‌

మార్కెట్‌ మూగబోయింది.

సాక్షి, చైతన్యపురి: దేశంలోనే అతిపెద్ద పండ్ల మార్కెట్‌గా ప్రసిద్ధి చెంది.. 35 ఏళ్లపాటు వేలాది మంది రైతులు, వ్యాపారులు, కమీషన్‌ ఏజెంట్లు, హమాలీలకు బాసటగా నిలిచి..నగరవాసులకు ఒక గుర్తుగా మిగిలిన గడ్డిఅన్నారం పండ్ల మార్కెట్‌ కథ ముగిసింది.1986లో ఏర్పడిన ఈ మార్కెట్‌కు మూడు రోజుల క్రితం తాళం పడింది. ఇక్కడ సూపర్‌ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించడంతో మార్కెట్‌ను బాటసింగారంలోని లాజిస్టిక్‌ పార్కుకు తరలించారు. దీంతో నిత్యం వందలాది లారీలు... లావాదేవీలు..చిరు వ్యాపారులతో సందడిగా ఉండే మార్కెట్‌ మూగబోయింది. మామిడి సీజన్‌లో ఇక్కడ భారీ లావాదేవీలు జరుగుతుంటాయి.


కొత్తపేట పండ్ల మార్కెట్‌ బుధవారం ఇలా బోసిపోయింది

రెండు తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా..ఇతర రాష్ట్రాల నుంచి కూడా భారీగా సరుకు వస్తుంటుంది. ఇక ఇవన్నీ ఆగిపోయినట్లే. మరోవైపు మార్కెట్‌ తరలింపును ఇష్టపడని వ్యాపారులు, రైతులు ఆందోళనలు చేపడుతున్నారు. ఏళ్లుగా ఇక్కడే జీవనోపాధి పొందుతున్న కూలీలు, హమాలీలు సైతం నిరాశకు గురయ్యారు. బాటసింగారంలో..కోహెడలో సరైన వసతులు కల్పించకుండా తమను అక్కడికి వెళ్లాలని ఆదేశించడం ఏమాత్రం సబబుగా లేదని వీరు నిరసన వ్యక్తం చేస్తున్నారు.

మరిన్ని వార్తలు