Gaddiannaram Fruit Market: 23లోగా తరలి వెళ్లాల్సిందే!.. ఎలా వెళ్లాలి? 

8 Aug, 2021 08:16 IST|Sakshi
గడ్డిఅన్నారం ఫ్రూట్‌ మార్కెట్‌

 గడ్డిఅన్నారం పండ్ల మార్కెట్‌ వ్యవహారంపై అధికారులు

కోర్టు ఆదేశాలను పాటిస్తాం: కమీషన్‌ ఏజెంట్లు

నిరసనల మధ్య ముగిసిన సమావేశం

సాక్షి, హైదరాబాద్‌: ఈ నెల 23వ తేదీ వరకు గడ్డిఅన్నారం పండ్ల మార్కెట్‌ను బాటసింగారం తరలించాలని మార్కెటింగ్‌ శాఖ నిర్ణయించింది. ఈ మేరకు మార్కెట్‌ స్థలాన్ని ఖాళీ చేసేందుకు మార్కెటింగ్‌ శాఖ చకచకా ఏర్పాట్లు చేస్తోంది. ఇందులో భాగంగా శుక్రవారం మార్కెట్‌ ఉన్నత శ్రేణి కార్యదర్శి పద్మహర్ష నేతృత్వంలో కమీషన్‌ ఏజెంట్ల సమావేశం ఎన్‌టీఆర్‌ కూరగాయల మార్కెట్‌ పరిధిలో నిర్వహించారు. సమావేశంలో పద్మహర్ష మాట్లాడుతూ..రాష్ట్ర మంత్రి మండలి నిర్ణయం ప్రకారం మార్కెట్‌ స్థలంలో సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రి నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించిన నేపథ్యంలో మార్కెట్‌ తరలింపు అనివార్యంగా మారిందన్నారు.

ఈ స్థలాన్ని వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖకు బదలాయిస్తూ..తాజాగా ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిందన్నారు. కోహెడలో మార్కెట్‌ను పూర్తిస్థాయిలో అభివృద్ధి చేసేంతవరకు తాత్కాలిక ప్రాతిపదికన బాటసింగారంలోని లాజిస్టిక్‌ పార్కులో ప్రస్తుత మార్కెటింగ్‌ కార్యకలాపాలు నిర్వర్తించాలని మార్కెటింగ్‌ శాఖ నిర్ణయించిందన్నారు. బాటసింగారంలో ఉన్న 11 ఎకరాల్లో రైతులకు, వ్యాపారులకు కోసం తగిన ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ఈ నెల 23 లోపు మార్కెట్‌ స్థలాన్ని వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖకు అప్పగించాల్సి ఉందన్నారు.   

సౌకర్యాలు లేకుండా ఎలా వెళ్లాలి? 
రెండు వారాల్లో మార్కెట్‌ను బాటసింగారం తరలించాలని మార్కెటింగ్‌ శాఖ తీసుకున్న నిర్ణయాన్ని వెనక్కి తీసుకొవాలని కమీషన్‌ ఏజెంట్లు, అన్ని సంఘాల ప్రతినిధులు డిమాండ్‌ చేశారు. కోహెడలో పక్కా నిర్మాణాలు చేస్తే ఎప్పుడైనా వెళ్లాడానికి సిద్ధంగా ఉన్నామని తెలిపారు. మరోవైపు తరలింపును ఆపాలని కోరుతూ హైకోర్టును ఆశ్రయించామని, తరలింపు వ్యవహారం కోర్టు ఆ«దీనంలో ఉండడంతో తాము ఈ విషయంలో ఎలాంటి నిర్ణయం సమావేశంలో చెప్పలేమని, ఇలా చేస్తే కోర్టు నియమాలకు విరుద్ధంగా ఉంటుందన్నారు. బాటసింగారం లాజిస్టిక్‌ పార్కు స్థలంలో కేవలం ఒకే ఒక్క షెడ్డు నిరి్మంచారని, ఇది వందల మంది రైతులకు ఎలా సరిపోతుందని ప్రశి్నంచారు. చివరకు ఏజెంట్ల వాదోపవాదాల మధ్య ఎలాంటి నిర్ణయం తీసుకోకుండానే సమావేశం ముగిసింది.

మరిన్ని వార్తలు