ప్లాస్మాథెరపీలో ‘గాంధీ’ సక్సెస్‌

4 Aug, 2020 04:34 IST|Sakshi

దేశంలో 5వ ర్యాంకు సాధించిన గాంధీ ఆస్పత్రి 

ప్లాస్మాథెరపీతో కోలుకున్న 25 మంది బాధితులు

ఐసీఎంఆర్‌ సూచనతో ప్రస్తుతం చికిత్సలు నిలిపివేత

గాంధీఆస్పత్రి (హైదరాబాద్‌): కరోనా వైద్యం లో భాగంగా చేపట్టిన ప్లాస్మాథెరపీ చికిత్సలు కోవిడ్‌ నోడల్‌ కేంద్రమైన సికింద్రాబాద్‌ గాంధీ ఆస్పత్రిలో వంద శాతం విజయవంతమయ్యా యి. దేశవ్యాప్తంగా నిర్వహించిన ప్లాస్మాథెరపీ చికిత్సల్లో ఐసీఎంఆర్‌ చేపట్టిన గ్రేడింగ్‌లో ఈ ఆస్పత్రికి 5వ స్థానం దక్కింది. కేటాయించిన కోటా పూర్తికావడంతో ఇండియన్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ మెడికల్‌ రిసెర్చ్‌ (ఐసీఎంఆర్‌) ఆదేశాల మేర కు ప్రస్తుతం గాంధీ ఆస్పత్రిలో ప్లాస్మాధెరపీ చికిత్సలు నిలిపివేశారు. అత్యంత క్లిష్టమైన, ప్రాణాపాయస్థితిలో ఉన్న 25 మంది రోగులకు ఇక్కడ ప్లాస్మా థెరపీ చికిత్స అందించి వైద్యులు పునర్జన్మనిచ్చారు. 25 మంది కోలుకుని ఇటీవలే డిశ్చార్జ్‌ అయ్యారు.  

మే 14న మొదటి ప్లాస్మాచికిత్స
సికింద్రాబాద్‌ గాంధీ ఆస్పత్రిలో ఐసీఎంఆర్‌ ఆదేశాలతో వెంటిలేటర్‌పై ఉన్న పాతబస్తీకి చెందిన యువకుడి (44)కి గత మే 14న 200 మిల్లీలీటర్ల ప్లాస్మా ఎక్కించారు. శరీరం స్పం దించడంతో మే 16న మరో డోస్‌ ప్లాస్మాను ఎక్కించడంతో బా«ధితుడు సంపూర్ణ ఆరోగ్యం తో కోలుకుని వారం తర్వాత డిశ్చార్జ్‌ అయ్యా డు. అనంతరం ప్రాణాపాయస్థితిలో ఉన్న మ రో 24 మందికి విజయవంతంగా ప్లాస్మాథెరపీ చికిత్స అందించారు. కాగా, కరోనా వైరస్‌కు వ్యాక్సిన్‌ వచ్చేందుకు మరికొంత సమయం పట్టనున్న క్రమంలో ప్లాస్మాథెరపీని కరోనా చికిత్సలో భాగం చేయాలా,  మరికొంతకాలం ప్రయోగాత్మకంగానే పరిశీలించాలా అనే అం శంపై ఐసీఎంఆర్‌ తర్జనభర్జన పడుతోంది. దేశవ్యాప్తంగా ఈ చికిత్సలు నిర్వహించిన 25 సెం టర్లలో చికిత్సపొందిన 625 మంది బాధితుల వివరాలను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. కొన్ని సెంటర్లలో ప్లాస్మాచికిత్స ఫలితాలు సాధించలేదు. తెలంగాణ, ఏపీలో సత్ఫలితాలనిచ్చిన క్రమంలో ప్రాంతాలవారీగా అధ్యయనం చేస్తున్నారు. అప్పటి వరకు ప్లాస్మా చికిత్సలకు విరామమివ్వాలని ఐసీఎంఆర్‌ నిర్ణయించింది.

5వ ర్యాంకు గర్వకారణం
ప్లాస్మాథెరపీ చికిత్సల్లో వంద శాతం ఫలితాలు సాధించి దేశవ్యాప్త గ్రేడింగ్‌లో గాంధీ ఆస్పత్రి 5వ ర్యాంకు సాధించడం గర్వకారణం. ఐసీఎంఆర్‌ సూచనతో ప్రస్తుతం ప్లాస్మాథెరపీ చికిత్సలు నిలిపివేశాం.
– ప్రొఫెసర్‌ రాజారావు, గాంధీ ఆస్పత్రి సూపరింటెండెంట్‌

>
మరిన్ని వార్తలు