Gandhi Jayanti 2021 మూఢ నమ్మకాలతో చెట్టు కిందే గాంధీ విగ్రహం

2 Oct, 2021 12:44 IST|Sakshi
Gandhi Jayanti 2021: మహబూబ్‌నగర్‌ జిల్లా నవాబుపేటలో చెట్టు కింద గాంధీ విగ్రహం

40 ఏళ్లుగా ప్రతిష్టాపనకు నోచుకోని విగ్రహం

మహబూబ్‌నగర్‌ జిల్లా నవాబుపేటలో విచిత్రం

నవాబుపేట: కీడు శంకించిందని మహాత్మా గాంధీ విగ్రహాన్ని పక్కనపడేశారు. ఏళ్ల తరబడి చెట్టు కింద బాపూజీ విగ్రహం పడి ఉంది. ప్రస్తుతం శిథిలావస్థకు చేరుకుంది. మూఢనమ్మకాలతో ప్రతిష్ఠించేందుకు ఎవరూ ముందుకు రాకపోవడంతో పెట్టిన చోటే శిథిలమైంది. వివరాలిలా ఉన్నాయి. సుమారు 40 ఏళ్ల కిందట మహబూబ్‌నగర్‌ జిల్లా నవాబుపేట మండలంలోని గురుకుంటలో గాంధీజీ విగ్రహాన్ని ఏర్పాటుచేయాలని అక్కడి ఉపాధ్యాయులు, గ్రామస్తులు తెప్పించారు.
చదవండి: మణికొండ సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి మృతికి బాధ్యత వహిస్తాం: మంత్రి కేటీఆర్‌ 

ఆ సమయంలో ఓ ఉపాధ్యాయుడికి రోడ్డు ప్రమాదంలో తీవ్ర గాయాలయ్యాయి. దీంతో కీడు శంకించిన గ్రామస్తులు ఆ విగ్రహాన్ని పోమాల్‌కు పంపించారు. అక్కడ విగ్రహం ఏర్పాటుకు సన్నాహాలు చేస్తుండగా ఓ గ్రామ పెద్ద అనారోగ్యాంతో ఇబ్బందులు పడ్డాడు. దీంతో 30 ఏళ్ల కిందట మండల కేంద్రం నవాబుపేటకు తీసుకొచ్చారు. ఇక్కడా ప్రతిష్టించేందుకు ఎవరూ ముందుకు రాకపోవటంతో విగ్రహం కాస్తా శిథిలావస్థకు చేరింది.
చదవండి: మద్యం తాగితే రూ.10 వేల జరిమానా

మరిన్ని వార్తలు