నగరానికి శోభ.. గండిపేట పార్కు: కేటీఆర్‌ 

4 Sep, 2022 03:40 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: హైదరాబాద్‌లోని గండిపేట జలాశయం వద్ద నూతనంగా ఏర్పాటు చేసిన పార్కు ప్రారంభోత్సవానికి సిద్ధంగా ఉందని మంత్రి కేటీఆర్‌ ట్వీట్‌ చేశారు. ఈ పార్కులో యాంఫీ థియేటర్‌తో పాటు గ్రీనరీతో కూడిన అందమైన ప్రదేశాలను ఏర్పాటు చేశారన్నారు. గండిపేట పార్కును అద్భుతంగా తీర్చిదిద్దిన ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అరవింద్‌ కుమార్‌కు, హెచ్‌ఎండీఏ బృందానికి కేటీఆర్‌ అభినందనలు తెలిపారు.

అందమైన హైదరాబాద్‌ నగరానికి ఈ పార్కు మరింత శోభను తీసుకొస్తుందని కేటీఆర్‌ తన ట్వీట్‌లో పేర్కొన్నారు. కాగా, గండిపేట పార్కును 5.50 ఎకరాల విస్తీర్ణంలో అద్భుతంగా తీర్చిదిద్దారు. రూ.35.60 కోట్ల వ్యయంతో పార్కును రూపొందించారు. సెంట్రల్‌ పెవిలియన్, టికెటింగ్‌ కౌంటర్‌లు, ఎంట్రన్స్‌ ప్లాజా, వాక్‌వేస్, ఆర్ట్‌ పెవిలియన్, ఫ్లవర్‌ టెర్రస్, పిక్‌నిక్‌ స్పేసెస్, ఓపెన్‌ ఎయిర్‌ థియేటర్, ఇన్నర్‌ యాక్సెస్‌ రోడ్, కిడ్స్‌ ప్లే ఏరియా, ఫుడ్‌ కోర్టులను నిర్మించారు.

మరిన్ని వార్తలు