ముస్తాబవుతున్న ఖైరతాబాద్‌ మహా గణపతి.. విశేషాలు ఇవే!

29 Aug, 2021 08:48 IST|Sakshi

వినాయక చవితి.. ఆ పండుగకు ఉండే జోషే వేరు. గణేష్ మండపాలు, భారీ సెట్టింగులు, వీధికో వినాయకుడు, పెద్దఎత్తున పూజలు ఇలా ప్రతీదిగా సందడిగా ఉంటుంది. ఇక, నవరాత్రుల చివరి రోజున నిర్వహించే శోభాయాత్ర అయితే మామూలుగా ఉండదు. కిలోమీటర్ల మేర బారులు తీరిన గణనాథులను చూడ్డానికి రెండు కళ్లూ సరిపోవు. నాలుగైదు నెలల ముందు నుంచే విగ్రహాలు తయారైతే, నెలరోజుల ముందు నుంచే సందడి మొదలవుతుంది. గణపతి బప్పా మోరియా… జైబోలో గణేష్ మహరాజ్ కీ జై… నినాదాలతో దేశమంతా మారుమోగిపోతుంది.

కరోనా మహమ్మారి కారణంగా గతేడాది ఈ సందడి లేదు. అయితే ఈ ఏడాది మాత్రం వినాయక చవితికి మళ్లీ సందడి కనిపించనుంది. ఈసారి గణేష్‌ ఉత్సవాలను అత్యంత ఘనంగా నిర్వహించేలా అన్ని రకాల ఏర్పాట్లు చేస్తున్నామని ప్రభుత్వం ఇప్పటికే వెల్లడించిన విషయం తెలిసిందే. దీంతో మహా సంబరానికి ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయి. సెప్టెంబర్‌ 10న వినాయక చవితి ఉత్సవాలకు భాగ్యనగరం సిద్ధమవుతోంది. గణేష్‌ విగ్రహాల తయారీ ఊపందుకుంది. ప్రతిమల ముస్తాబు చివరి దశకు చేరుకుంది. నవరాత్రుల బందోబస్తు, సామూహిక నిమజ్జనం తదితర ఏర్పాట్లకు సంబంధించి నగర పోలీసుల పటిష్ట భద్రత ఏర్పాటు చేశారు.

ఈ ఏడాది ఖైరతాబాద్‌ వినాయకుడిని పంచముఖ రుద్ర మహాగణపతి రూపంలో తయారు చేస్తున్నారు. మరి ఆ ఆకారంలో రూపొందించడానికి కారణం ఏంటి?, ఈసారి ఎన్ని అడుగుల విగ్రహాన్ని ప్రతిష్టించనున్నారు. ఖైరతాబాద్‌ మహా గణపతి తయారీకి సంబంధించిన విశేషాలను శిల్పి రాజేంద్రనాథ్‌ ‘సాక్షి’ డిజిటల్‌కు వివరించారు. ఆ విశేషాలేంటో ఈ వీడియోలో చూడండి.

మరిన్ని వార్తలు