Ganesh Immersion: రేపు, ఎల్లుండి మద్యం దుకాణాలు బంద్‌

18 Sep, 2021 18:08 IST|Sakshi

పబ్‌లు, బార్లు కూడా మూసివేత

గణేశ్‌ నిమజ్జనం నేపథ్యంలో పోలీసుల నిర్ణయం

హైదరాబాద్‌, సైబరాబాద్‌, రాచకొండ కమిషనరేట్ల పరిధిలో అమలు

సాక్షి, హైదరాబాద్‌: దేశంలో ముంబై తర్వాత అత్యంత ఘనంగా వినాయక నిమజ్జనం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి లక్షలాది మంది తరలివస్తుంటారు. హైదరాబాద్‌లో రేపు ఆదివారం మహా నిమజ్జనం జరగనుంది. జంట నగరాలతో పాటు ఇతర ప్రాంతాల నుంచి కూడా వినాయక విగ్రహాలు తరలి రానున్నాయి. శోభాయమానంగా జరిగే గణేశ్‌ నిమజ్జన మహోత్సవానికి హైదరాబాద్‌లో తెలంగాణ ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది.

చదవండి: మొన్నటి వరకూ కేంద్రమంత్రి.. ఇప్పుడు టీఎంసీ గూటికి 

అయితే నిమజ్జనం సందర్భంగా హైదరాబాద్‌లో తీవ్ర ఆంక్షలు విధించారు. అందులో భాగంగా మద్యం దుకాణాలు మూసి వేస్తున్నారు. ఆది, సోమవారం (19వ తేదీ ఉదయం 9 నుంచి 20వ తేదీ సాయంత్రం 6 గంటల వరకు) మద్యం దుకాణాలు మూసి ఉంటాయని హైదరాబాద్‌, సైబరాబాద్‌, రాచకొండ పోలీసులు ఉత్తర్వులు జారీ చేశారు. ఆయా పోలీస్‌ కమిషనరేట్ల పరిధిలో ఉన్న వైన్స్‌తో పాటు బార్లు, పబ్‌లు మూసి ఉంటాయని ఎక్సైజ్‌ పోలీసులు ప్రకటించారు.
చదవండి: మహిళలను గౌరవిస్తే మీకు 23 సీట్లు వచ్చేవి కావు
 

మరిన్ని వార్తలు