మంత్రి గంగులకు పితృ వియోగం 

5 Jan, 2023 03:28 IST|Sakshi

కరీంనగర్‌/సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్‌ తండ్రి గంగుల మల్లయ్య బుధవారం సాయంత్రం కరీంనగర్‌లోని తమ స్వగృహంలో గుండెపోటుతో మృతి చెందారు. తండ్రి మరణవార్త తెలుసుకున్న మంత్రి గంగుల తన కార్యక్రమాలను రద్దు చేసుకుని హుటాహుటిన ఇంటికి చేరుకున్నారు. మల్లయ్యకు నలుగురు కుమారులు, ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. కమలాకర్‌ చిన్న కుమారుడు. 

సీఎం కేసీఆర్‌ సంతాపం: మంత్రి గంగుల కమలాకర్‌ తండ్రి మల్లయ్య (87) మృతి పట్ల ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌ రావు సంతాపం వ్యక్తం చేశారు. విషయం తెలుసుకున్న ముఖ్యమంత్రి.. ఫోన్‌ చేసి గంగులను పరామర్శించారు. కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు. అలాగే మంత్రులు, స్పీకర్‌ పోచారం, ఇతర ప్రముఖులు మల్లయ్య మృతికి సంతాపం ప్రకటించారు. 

మరిన్ని వార్తలు