ప్రతీ గింజనూ కేంద్రం కొనాల్సిందే: మంత్రి గంగుల

14 Sep, 2021 14:26 IST|Sakshi

కరీంనగర్‌: తెలంగాణ రైతులపై వివక్ష చూపకండని రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘం, పౌరసరఫరాల మంత్రి గంగుల కమలాకర్‌ కేంద్రాన్ని కోరారు. ఇటీవల కేటీఆర్‌తో పాటు తాను కేంద్ర మంత్రి పీయూష్ గోయల్‌ను కలిసి పంట కొనుగోలు విషయాన్ని సామాజిక కోణంలో చూడాలని కోరినట్లు ఆయన తెలిపారు. మంగళవారం మీడియాతో మాట్లాడుతూ..  రాష్ట్రాల్లో అవసరానికి సరిపడా బియ్యం ఉంచుకొని మిగులు బియ్యం ఎఫ్‌సీఐకి పంపాలని కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం మధ్య ఎంఓయూ జరిగిందని గుర్తు చేశారు. 

కావున ఇదివరకే 19/20 యాసంగిలో 64 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం,  20/21లో లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం కొన్నామని , దాంతో 62 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం వచ్చిందన్నారు. ఇప్పుడు ఆ బియాన్ని కొనుగోలు చేయాలని కేంద్రాన్ని అడిగితే అవి బాయిల్డ్ రైస్ అని అందులో కేవలం 25 లక్షల మెట్రిక్ టన్నులే తీసుకుంటామని తెలిపడం సమంజసం కాదన్నారు. మిగతా 37 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం ఎవరూ కొంటారని కేంద్రమే చెప్పాలని ఆవేదని వ్యక్తం చేశారు.

బాయిల్డ్ రైస్ తీసుకోకపోతే రైస్ మిల్లులో పేరుకుపోయి కొత్త ధాన్యం ఎక్కడ పెట్టాలని కనుక  ఈ అంశంపై బండి సంజయ్, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కేంద్రంపై ఒత్తిడి తేవాలని కోరారు. ప్రతీ గింజనూ కేంద్రం తప్పకుండా కొనాలని, లేకపోతే నిలదీస్తామన్నారు. పంజాబ్‌లో బాయిల్డ్ రైస్ మొత్తం కొన్న కేంద్రం, తెలంగాణలో మాత్రం ఎందుకు కొనడంలేదని ప్రశ్నించారు. ఇలాంటి సంక్షోభం గతంలో కూడా వస్తే వాజ్‌పేయి ప్రభుత్వం పూర్తిగా ఏడు కోట్ల టన్నులు కొనుగోలు చేసిందని, ఇప్పుడు కూడా మోదీ ప్రభుత్వం పూర్తిగా బియ్యం కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తున్నామన్నారు. తెలంగాణ అంటే వివక్ష ఉండకూడదని, రాష్ట్ర రైతాంగం భవిష్యత్తును నాశనం చేయొద్దని ఆయన కోరారు.

చదవండి: రజనీకాంత్‌ స్టైల్‌లో డ్యాన్స్‌ చేసి అదరగొట్టిన మంత్రి హరీశ్‌రావు

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు