తెలంగాణలో మొదటి ‘గే’ వివాహం: జంటగా మారనున్న ఇద్దరు పురుషులు

31 Oct, 2021 16:29 IST|Sakshi

హైదరాబాద్‌: తెలంగాణలోని తొలిసారి ఇద్దరు స్వలింగ సంపర్కులు పెళ్లితో ఒక్కటి కానున్నారు.  హైదరాబాద్‌కు చెందిన సుప్రియో, అభయ్‌లకు 2013లో డేటింగ్‌ పరిచయం ఏర్పడింది. ఆ తర్వాత వీరి స్నేహం కాస్త ప్రేమగా మారింది. ఈ క్రమంలో వీరిద్దరు ఎనిమిదెళ్లుగా ప్రేమించుకుంటున్నారు. సుప్రియో హైదరాబాద్‌లో.. హోటల్‌ మెనేజ్‌మెంట్‌ స్కూల్‌లో లెక్చరర్‌గా పనిచేస్తున్నాడు. అదేవిధంగా.. అభయ్‌  సాఫ్ట్‌వేర్‌ కంపెనీలో డెవలపర్‌గా పనిచేస్తున్నాడు.

ఈ క్రమంలో వీరి ప్రేమకు పెద్దలు కూడా అంగీకారం తెలిపారు. దీంతో వీరు.. వచ్చే డిసెంబరులో వివాహంతో ఒక్కటికానున్నట్లు సుప్రియో జంట ఒ​క ప్రకటనలో తెలిపారు. తెలంగాణలో ఇద్దరు స్వలింగ సంపర్కులు(గే) చేసుకుంటున్న తొలి వివాహం ఇదే. తమ వివాహనికి కుటుంబ సభ్యులను ఒప్పించడానికి ఎన్నో సంవత్సరాలు పట్టిందని సుప్రియో తెలిపాడు. కాగా, తమ పెళ్లిలో సంప్రదాయ బద్ధంగా మంగళస్నానాలు, సంగీత్‌ వంటి  కార్యక్రమాలు ఉంటాయని స్వలింగ సంపర్కులు తెలిపారు. 

చదవండి: 300 అడుగుల లోతున పడిన బస్సు.. 13 మంది మృతి

మరిన్ని వార్తలు