తెలంగాణకు భారీ వర్షాలు: జీహెచ్‌ఎంసీ హెచ్చరిక

17 Sep, 2020 19:03 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: రానున్న మూడు గంటల్లో తెలంగాణలో చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షం​ కురిసే అవకాశం ఉందని, అంతేగాక పలు చోట్లు పిడుగు పడే అవకాశం కూడా ఉందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. దీంతో అత్యవసరమైతే తప్పా బయటకు రావద్దోని జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ ప్రజలను విజ్ఞప్తి చేశారు. ఒకవేళ అత్యవసర పరిస్థితి ఏర్పడితే 040 29555500, 040 21111111కు సమాచారం ఇవ్వాలని ఆయన సూచించారు. ఈదురు గాలులతో పాటు ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసే అవకాశం ఉన్నందున నగర ప్రజలంతా జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు. అదే విధంగా నగరంలోని లోతట్టు ప్రాంతాలల్లో భారీ వర్షం కురిసే అన్ని ప్రాంతాల్లో డిజాస్టర్ రెస్పాన్స్‌  ఫోర్స్‌ టీం, ఎమర్జెన్సీ బృందాలను ఆయన అప్రమత్తం చేశారు. 

తెలంగాణలో భారీ వర్షాలు కురిసే అవకాశం
తెలంగాణలో దాని పరిసర ప్రాంతాలలో ఉపరితల ఆవర్తనం 2.1 కిమీ ఎత్తు వరకు కొనసాగుతోంది. తూర్పు-పశ్చిమ షేర్‌ జోన్‌లో పెనిన్సులర్ 6.0 అక్షాంశం వెంబడి భారతదేశం మీదుగా 4.5కిమీ నుంచి 5.8 కిమీ ఎత్తు మధ్య కొనసాగుతోంది. అంతేగాక ఉత్తర కోస్తా ఆంధ్రతో పాటు దాని పరిసర ప్రాంతాలలో 3.1కిమీ నుంచి 3.6 కిమీ ఎత్తు మధ్య ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. ఇక ఈశాన్య బంగాళాఖాతం దాని పరిసర ప్రాంతాలలో సుమారుగా సెప్టెంబరు 20వ తేదీన వరకు అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉంది. దీనివల్ల రాగల మూడు రోజులు రాష్ట్రంలో అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో పాటు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు అనేక చోట్ల కురిసే అవకాశం ఉంది. (హైదరాబాద్ వర్షాలు‌: కొట్టుకొచ్చిన మొసళ్లు)

ఆదిలాబాద్, కోమురంభీం-ఆసిఫాబాద్, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్నసిరిసిల్ల, కామారెడ్డి, మెదక్, సంగారెడ్డి, సిద్దిపేట, వికారాబాద్, మేడ్చల్ మల్కాజిగిరి, హైదరాబాద్, రంగారెడ్డి, యాదాద్రి భువనగిరి, మెహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, నల్గొండ, వనపర్తి, జోగులాంబ గద్వాల్, నారాయణ పేట, జిల్లాలలో ఇవాళ  ఒకటి రెండు చోట్ల భారీ నుండి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. శుక్రవారం కూడా భారీవర్షాలు కురిసే అవకాశం ఉంది. శనివారం మాత్రం ఒకటి రెండు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం సంచాలకులు వెల్లడించారు.

మరిన్ని వార్తలు