జీహెచ్‌ఎంసీ ఎన్నికలు: రచ్చ రంబోలా

25 Nov, 2020 08:44 IST|Sakshi

బీజేపీ– టీఆర్‌ఎస్‌ల మధ్య వాడీవేడీ కామెంట్లు  

ఓటర్ల చీలికే లక్ష్యంగా వ్యూహ ప్రతివ్యూహాలు  

తానేం తక్కువ కాదంటున్న కాంగ్రెస్‌  

మాటకు మాటతో సై అంటున్న ఎంఐఎం 

సాక్షి, హైదరాబాద్‌: చలికాలంలోనూ మహానగరం రాజకీయ నాయకుల మాటల దాడులు, ప్రతిదాడులతో వేడెక్కుతోంది. గతానికి భిన్నంగా నగర ఓటర్లలో చీలిక తెచ్చే యత్నాలతో ప్రధాన పార్టీలు మాటల తూటాలు పేలుస్తున్నాయి. జీహెచ్‌ఎంసీ ఎన్నికల నోటిఫికేషన్‌ దగ్గర్నుంచి అధికార టీఆర్‌ఎస్‌పై తనదైన శైలిలో దాడి చేస్తున్న బీజేపీ సర్జికల్‌ స్ట్రైక్స్‌ కామెంట్‌తో పెద్ద దుమారానికి తెర లేపింది, రాజకీయ అలజడిని సృష్టించింది. దీన్ని అధికార పార్టీ అస్త్రంగా మలుచుకుని రివర్స్‌ అటాక్‌కు దిగింది. కాంగ్రెస్‌ సైతం తానేం తక్కువ కాదని దూకుడు పెంచింది. మరోవైపు ఎంఐఎం సవాల్‌తో గొంతెత్తింది. కౌంటర్‌లు.. అటాక్‌లతో.. భాగ్యనగరం రంగస్థలమైంది. మాటల రణక్షేత్రంగా మారింది. 

ఎన్నికల ప్రచారంలో ప్రత్యర్థులకు అందనంత స్పీడ్‌తో దూసుకుపోతున్న టీఆర్‌ఎస్‌ బీజేపీపైనే ప్రధాన విమర్శలు ఎక్కుపెడుతోంది. గడచిన ఆరేళ్లలో కర్ఫ్యూ లేని నగరంగా.. ప్రపంచ దేశాల్లోనే అగ్రగామి నగరంగా హైదరాబాద్‌ ముందుకు వెళుతోందని, మరో ఐదేళ్లు అధికారం ఇస్తే నగర ప్రగతికి హద్దులువండవని ఆ పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ స్పష్టం చేస్తున్నారు. బీజేపీకి పగ్గాలు అప్పగిస్తే అభివృద్ధి స్థానంలో అరాచకం, విధ్వంసం వస్తాయని.. నగర ప్రజలు అభివృద్ధి వైపా? అరాచకం వైపా? తేల్చే సమయం ఆసన్నమైందని పేర్కొంటున్నారు.   

పచ్చని హైదరాబాద్‌లో చిచ్చు పెడతారా?: టీఆర్‌ఎస్‌ 
ప్రశాంతంగా ఉండే హైదరాబాద్‌ కావాల్నా? రోజూ తెల్లారి లేస్తే పంచాయితీ పెట్టుకునే హైదరాబాద్‌ కావాల్నా? అభివృద్ధి కావాలా.. అరాచకం కావాలా? 
⇔ గల్లీలో జరిగే ఎన్నికలకు ఢిల్లీ నుంచి దిగుతున్నారు. టీఆర్‌ఎస్‌ను చూస్తుంటే బీజేపీ  పెద్దలకు భయమేస్తోంది. ముషీరాబాద్‌లో బీజేపీ, ఎంఐఎంలను కలిపి కొట్టాలి.  
⇔ హైదరాబాద్‌పై సర్జికల్‌ స్ట్రైక్‌ చేస్తారా? పచ్చని హైదరాబాద్‌లో చిచ్చుపెడతారా? కొన్ని  సీట్లు, ఓట్ల కోసం కోటిమంది హైదరాబాదీయులను బలితీసుకుంటారా? పచ్చని హైదరాబాద్‌ను పాకిస్థాన్‌ ఉగ్రవాద స్థావరాలతో పోలుస్తారా? ధైర్యం 

టీఆర్‌ఎస్‌.. హైదరాబాద్‌పై సర్జికల్‌ స్ట్రైక్‌ చేస్తారా? పచ్చని హైదరాబాద్‌లో చిచ్చుపెడతారా? కొన్ని సీట్లు, ఓట్ల కోసం కోటిమంది హైదరాబాదీయులను బలితీసుకుంటారా? పచ్చని హైదరాబాద్‌ను పాకిస్థాన్‌ ఉగ్రవాద స్థావరాలతో పోలుస్తారా? ధైర్యం ఉంటే పేదరికంపై, మత విద్వేషాలపై, నిరుద్యోగ సమస్యపై సర్జికల్‌ స్ట్రైక్స్‌ చేయండి.   

కమలం పార్టీ.. బీజేపీని గెలిపిస్తే పాతబస్తీలో సర్జికల్‌ స్ట్రైక్‌ చేస్తాం. పాతబస్తీలోని పాకిస్థానీలు, బంగ్లాదేశీయులు, రోహింగ్యాలు, బచ్చాగాళ్లు, బఫూన్‌ గాళ్లు ఓట్లు వేస్తున్నారు. వారిని రిమికొడతాం. హిందూస్థాన్‌ భాగ్యనగరం కావాలా? పాకిస్థాన్‌ భాగ్యనగర్‌ కావాలా? దేశభక్తి పార్టీ బీజేపీ కావాలా? దేశద్రోహి పార్టీలైన టీఆర్‌ఎస్, ఎంఐఎం కావాలా?    

కాంగ్రెస్‌.. టీఆర్‌ఎస్‌ మేనిఫెస్టో చెత్తబుట్టలో చిత్తు కాగితంలాంటిది. కరోనాతో ప్రజలు చనిపోతుంటే కేసీఆర్‌ ఫామ్‌హౌస్‌లో ఉన్నాడు. 100 ఏళ్ల తర్వాత పెద్ద ఎత్తున వరదలు వస్తే..  బాధితులకు ఇవ్వాల్సిన పరిహారాన్ని టీఆర్‌ఎస్‌ నేతలు పందికొక్కుల్లా మేశారు. టీఆర్‌ఎస్, బీజేపీలది తెరచాటు దోస్తానా.  

ఎంఐఎం.. పాతబస్తీలో సర్జికల్‌ స్ట్రైక్‌ కాదు.. కమలనాథులు దమ్ముంటే భారత్‌సరిహద్దులో తిష్టవేసిన చైనా సైన్యంపై సర్జికల్‌ స్ట్రైక్‌ చేయాలి. టీఆర్‌ఎస్‌తో దోస్తీ లేదు ఇక ఫైటే. కేటీఆర్‌ ఒక చిలుక.. నిన్న కళ్లు తెరిచాడేమో ఎక్కువ మాట్లాడుతున్నాడు. మాకు కుర్చీలో కూర్చోబెట్టడం తెలుసు.. పడేయడమూ తెలుసు. 

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు