నాడు నాన్న.. నేడు అమ్మ  అనాథైన బాలిక

11 Dec, 2022 12:33 IST|Sakshi

సాక్షి, మెదక్‌: తండ్రి, తల్లి మృతితో నా అనేవారు లేక ఓ బాలిక అనాథగా మారింది. సర్పంచ్, గ్రామస్తులు ముందుకు వచ్చి అంత్యక్రియలు చేసిన ఘటన జగదేవ్‌పూర్‌ మండలం రాయవరం గ్రామంలో శనివారం జరిగింది. గ్రామానికి చెందిన గుమ్ల రాములు, మల్లవ్వ దంపతులకు కూతురు రేణుక ఉంది.

రేణుక వర్గల్‌ కస్తూర్బాలో ప్రస్తుతం పదో తరగతి చదువుతోంది. రాములు పదేళ్ల క్రితం మృతి చెందగా, మల్లవ్వ తన కూతురుతో కలిసి రెండేళ్లుగా కుకునూర్‌పల్లిలో ఉంటూ జీవనం సాగిస్తుంది. ఈ క్రమంలో మల్లవ్వ అనారోగ్యంతో రెండు రోజుల క్రితం మృతిచెందింది. బంధువులు ఎవరు రాకపోవడంతో గజ్వేల్‌ ప్రభుత్వాస్పత్రి మార్చురీలో మృతదేహాన్ని ఉంచారు.

విషయం తెలుసుకున్న రాయవరం సర్పంచ్‌ పావని మల్లవ్వ శనివారం అంత్యక్రియలకు సాయం అందించారు. తల్లిదండ్రుల మృతితో అనాౖథెన బాలికను రాష్ట్ర అటవీ అభివృద్ధి సంస్థ చైర్మన్‌ ప్రతాప్‌రెడ్డి పరామర్శించి, ఆర్థిక సాయం అందించారు.   

(చదవండి: అర్థరాత్రి తప్పతాగి ఎస్‌ఐని ఢీకొట్టారు.. తీవ్రగాయాలతో..)

మరిన్ని వార్తలు :

మరిన్ని వార్తలు