సెల్‌ఫోన్‌ వాడొద్దన్నందుకు బాలిక ఆత్మహత్య

19 Sep, 2023 20:09 IST|Sakshi

హైదరాబాద్: సెల్‌ఫోన్‌ ఎక్కువగా వాడుతున్నావని, ఇది మంచిది కాదని తల్లిదండ్రులు మందలించగా మనస్థాపానికి గురై కూతురు ఆత్మహత్య చేసుకున్న ఘటన బంజారాహిల్స్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో చోటు చేసుకుంది. వివరాలివీ... వెస్ట్‌బెంగాల్‌కు చెందిన సంజీబ్‌ మండల్‌ ఎలక్ట్రీషియన్ గా పనిచేస్తూ బంజారాహిల్స్‌ రోడ్‌ నెం. 10లోని నూర్‌నగర్‌లో కుటుంబంతో కలిసి అద్దెకుంటున్నాడు.

ఆయన కూతురు ఇషికా మండల్‌(13) స్థానిక ప్రైవేట్‌ పాఠశాలలో 8వ తరగతి చదువుతున్నది. ఎప్పటిలాగే శుక్రవారం సాయంత్రం స్కూల్‌ నుంచి వచి్చన ఆమె బెడ్‌రూమ్‌లోకి వెళ్లి సెల్‌ఫోన్‌ను అదే పనిగా చూస్తున్నది. పలుమార్లు మందలించినా ఇషికా ఫోన్‌చూడటం మాత్రం మానడం లేదు.

తల్లిదండ్రులు ఈ విషయంలో కూతురిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పది నిమిషాల తర్వాత తన గదిలోకి వెళ్లిన ఇషికా ఫ్యాన్‌కు ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. తండ్రి ఇచి్చన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. 
 

మరిన్ని వార్తలు