ప్రియుడి ఇంటి ఎదుట ప్రియురాలి బైఠాయింపు

4 Apr, 2022 22:54 IST|Sakshi
బాధితురాలు కాదాసు కీర్తన

అక్కన్నపేట(హుస్నాబాద్‌): పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేశాడంటూ ఓ యువతి ప్రియుడి ఇంటి ఎదుట బైఠాయించింది. ఆమె కథనం ప్రకారం రాజన్న సిరిసిల్ల జిల్లా, రుద్రంగి మండలానికి చెందిన కాదాసు కీర్తన, అక్కన్నపేట మండలం గోవర్ధనగిరి గ్రామానికి చెందిన బత్తుల సతీశ్‌ తొమ్మిదేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. పెళ్లి చేసుకుంటానని యువతిని నమ్మించి గర్భవతిని చేశాడు.

గర్భం పోయేందుకు అబార్షన్‌ చేయించాడు. అనంతరం వారి ఇరువురి పెద్దల సమక్షంలో పెళ్లి చేసుకుంటానని సతీశ్‌ ఒప్పకున్నాడు.  అయితే పెళ్లి చేసుకోకుండా ఏదో ఒక సాకు చూపుతూ పెళ్లిని దాటవేస్తున్నాడు. 2020 సెప్టెంబర్‌ 12 తేదీన సతీశ్‌ తల్లిదండ్రులు గ్రామ పెద్దల సమక్షంలో కొడుకుతో పెళ్లి చేస్తామని ఒప్పంద ప్రతం రాసి ఇచ్చారు. ఆ మేరకు రెండు నెలల క్రితం రుదంగ్రి గ్రామంలోని లక్ష్మీ నర్సింహస్వామి దేవాలయంలో వరపూజ జరిగింది.

నెలలోపు  పెళ్లి ఏర్పాటు చేస్తామని ప్రియుడు,  అతడి తల్లిదండ్రులు అంగీకరించారు.  అయితే వరకట్నంగా కారు, డబ్బులు ఇస్తేనే పెళ్లి చేసుకుంటానంటూ ప్రియుడు, అతడి తల్లిదండ్రులు వేధిస్తున్నారని కీర్తన కన్నీటి పర్యతమైంది. ప్రియుడు, అతడి తల్లిదండ్రులు బత్తుల కొమురయ్య, ఎల్లవ్వ, వారిని ప్రోత్సహిస్తున్న మల్లేశ్‌పై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. తనకు న్యాయం జరగకుంటే ప్రియుడి ఇంటి ఎదుట ఆత్మహత్య చేసుకుంటానని కీర్తన హెచ్చరించింది.

మరిన్ని వార్తలు