నేను చిన్నపిల్లను; నాకు పెళ్లొద్దు.. చదువుకుంటా!

10 Jun, 2021 08:17 IST|Sakshi

30 ఏళ్ల వ్యక్తితో 14 ఏళ్ల బాలిక వివాహానికి యత్నం 

వద్దని వేడుకున్నా వినని పెద్దమనుషులు  

అడ్డుకున్న బాలల సంరక్షణ అధికారులు 

సాక్షి,గీసుకొండ: ‘సార్‌.. నేనింకా చిన్నపిల్లను. బాగా చదువుకుని పెద్ద ఉద్యోగం చేయాలని ఉంది. ఎంత చెప్పినా పెద్దలు వినడం లేదు. పైగా 30 ఏళ్ల వ్యక్తికి, అదీ మొదటి భార్యతో విడాకులైన వ్యక్తికి నన్ను కట్టబెట్టాలని చూస్తున్నారు. అందరికీ తెలిస్తే అడ్డుకుంటారని దొంగచాటుగా పెళ్లి చేయాలని ప్రయతి్నస్తున్నారు..నాకీ పెళ్లి ఇష్టం లేదు. ఎలాగైనా ఆపండి.. ఇదీ పద్నాలుగేళ్ల బాలిక తనకు వివాహం చేయాలని పెద్దలు యత్నించిన క్రమంలో అధికారులకు ఫిర్యాదు చేశారు.

వివరాలు... వరంగల్‌ రూరల్‌ జిల్లా నర్సంపేట మండలం రాజుపేట శివారు గార్లగడ్డ తండాకు చెందిన 9వ తరగతి చదువుతున్న బాలికతో వరంగల్‌ అర్బన్‌ జిల్లా వాసి, ఇప్పటికే మొదటి భార్యతో విడాకులు తీసుకున్న 30 ఏళ్ల వ్యక్తితో వివాహం చేయడానికి పెద్దమనుషులు నిర్ణయించారు. తనకు ఈ పెళ్లి ఇష్టం లేదని.., చదువుకుంటానని ఆ బాలిక మొరపెట్టుకున్నా పెద్దమనుషులు వినకుండా నిశి్చతార్థం చేశారు.

దీంతో దిక్కుతోచని ఆ బాలిక తన స్నేహితురాలితో చైల్డ్‌లైన్‌కు సంబంధించి 1098 ఫోన్‌ చేయమని చెప్పింది. ఇంతలోనే స్థానిక ఎంపీటీసీ వీరన్న కూడా ఈ విషయాన్ని బాలల సంరక్షణ అధికారులకు తెలియజేశారు. ఇది తెలుసుకున్న పెద్దమనుషులు బుధవారం బాలిక అమ్మమ్మ గ్రామమైన గీసుకొండ మండలంలోని నందనాయక్‌ తండాలో గుట్టుచప్పుడు కాకుండా వివాహం జరిపించడానికి సిద్ధమవుతుండగా బాలల పరిరక్షణ విభాగం అధికారులు పెళ్లి తంతును అడ్డుకున్నారు. 
చదవండి: 20 మీటర్లు.. 12 అడుగులు..!

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు