రైలు పట్టాల పక్కన తీవ్రగాయాలతో బాలిక.. పడేశారా?

10 Jul, 2021 13:56 IST|Sakshi
గాయపడిన బాలిక

రైతులు గమనించి పోలీసులకు సమాచారం

పరిస్థితి విషమం.. హైదరాబాద్‌ తరలింపు

పెద్దపల్లి జిల్లాకేంద్రం శివారులో ఘటన

సాక్షి, పెద్దపల్లి: పొద్దున్నే పొలం పనులకు వెళ్తున్న రైతులకు రైలుపట్టాల పక్కన ఐదేళ్ల బాలిక ఏడుపు వినిపించింది. అటుగా వెళ్లిన గమనించగా. తీవ్రగాయాలతో రెండుకాళ్లు విరిగి అచేతనస్థితిలో పడి ఉంది. ఈ ఘటన పెద్దపల్లి జిల్లాకేంద్రానికి సమీపంలో ఉన్న గొల్లపల్లి గ్రామశివారులో శుక్రవారం ఉదయం ఆరుగంటల ప్రాంతంలో చోటుచేసుకుంది. రైతులు రైల్వే గేట్‌మెన్‌ షామిమ్‌ సాయంతో పోలీసులకు, 108కు సమాచారం ఇచ్చారు. పెద్దపల్లి ఆస్పత్రికి తరలించగా.. బాలికకు రెండుకాళ్లు మూడుచోట్ల విరిగాయని, పరిస్థితి విషమంగా ఉందని ప్రథమ చికిత్స చేసిన అనంతరం హైదరాబాద్‌లోని ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు.

పడిందా.. పడేశారా?
అయితే ఈ ఘటనపై పలువురు భిన్న అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. బాలిక దివ్యాంగురా లని వైద్యులు తెలపగా.. రైలులో నుంచి ప్రమాదవశాత్తు జారిపడిందా..? లేదా ఎవరైనా తోసే శారా అనే అనుమానం వ్యక్తం అవుతోంది. రా మగుండం రైల్వే హెడ్‌ కానిస్టేబుల్‌ తిరుపతి ఘ టన స్థలాన్ని పరిశీలించారు. బల్లార్ష– కాజీపేట వైపు ఉదయాన్నే వెళ్లిన రైళ్లలోని ప్రయాణికులకు సమాచారం ఇచ్చేలా పోలీసులకు తెలిపారు. సాయంత్రం వరకు కూడా బాలికకోసం ఎవరూ ఫిర్యాదు చేయలేదని పోలీసులు పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు