రాష్ట్రంలో బాలికలకు రక్షణ లేదు: సంజయ్‌

13 Jun, 2022 04:15 IST|Sakshi

దిల్‌సుఖ్‌నగర్‌: తెలంగాణలో బాలికలకు, పిల్లలకు రక్షణ లేకుండా పోయిందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ ఆందోళన వ్యక్తం చేశారు. ఆదివారం ఆర్కేపురం డివిజన్‌ ఎన్టీఆర్‌ నగర్‌లో 5 రోజుల కిందట అత్యాచారానికి గురైన మైనర్‌ బాలిక కుటుంబ సభ్యులను బీజేపీ రాష్ట్ర మహిళా నాయకులతో కలసి సంజయ్‌ పరామర్శించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ అత్యాచారాలకు పాల్పడుతున్న ఎంఐఎం, టీఆర్‌ఎస్‌ పార్టీ నాయకుల వీపులను ప్రజలు త్వరలోనే పగలగొడతారని హెచ్చరించారు.

జూబ్లీహి ల్స్‌లో జరిగిన సంఘటనపై టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం స్పందించకపోవడం వల్లే రాష్ట్రం లో బాలికలపై అత్యాచారాలు పెరిగిపోతు న్నాయని ఆగ్రహం వ్యక్తంచేశారు. ప్రభు త్వం దుండగుల పట్ల కఠినంగా వ్యవహరిం చకపోగా వారికి రక్షణ కల్పిస్తోందని ఆరో పించారు. అత్యాచార ఘటనలపై ముఖ్య మంత్రి కేసీఆర్‌ స్పం దించకపోవడం సిగ్గుచేటన్నారు. అత్యాచారాలకు సంబంధించిన సంఘటనలను మీడియా, ప్రజలు వెలుగులోకి తీసుకొస్తుంటే అధికార యంత్రాంగం, ప్రభుత్వం ఏం చేస్తున్నాయ ని ప్రశ్నించారు. ఇటీవల కార్ఖానాలో ఎంఐఎం ఇలాంటి ఘటనకు పాల్పడిందని దోషులను కఠినంగా శిక్షించాలని సంజయ్‌ డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర నాయకులు సునీతారెడ్డి పాల్గొన్నారు.

నిందితుడిని కఠినంగా శిక్షించాలి
బాలికపై అత్యాచారానికి పాల్పడిన నిందితుడిని కఠినంగా శిక్షించేలా చూడాలని స్థానిక మహిళలు సంజయ్‌ను డిమాండ్‌ చేశారు. మాకు ఓదార్పులు అవసరం లేదని తప్పు చేసిన వారిని కఠినంగా శిక్షించాలని విజ్ఞప్తి చేశారు. నిందితుడు బయటకు వస్తే ఊరుకునే సమస్య లేదని హెచ్చరించారు.  

మరిన్ని వార్తలు