మందు తాగే మేక.. రోజూ మద్యం కోసం యాజమాని వద్ద నిలబడి

28 Mar, 2023 13:40 IST|Sakshi

సాక్షి, యాదాద్రి జిల్లా: యాదాద్రి భువనగిరి జిల్లా ఆత్మ­కూరు­(ఎం) మండలం మోదుగకుంటకు చెందిన రైతు సోలిపురం రవీందర్‌ రెడ్డి పెంచుకుంటున్న ఓ మేకకు ఒకరోజు మద్యాన్ని పట్టించాడు. అప్పటినుంచీ ప్రతిరోజూ సాయంత్రంపూట రవీందర్‌ రెడ్డి మద్యాన్ని తాగినప్పుడల్లా మేక కూడా వచ్చి యజమాని వద్ద నిలబడుతుంది.

దీంతో ప్రతిరోజూ మేకకు మద్యం తాగిస్తుండటంతో దాని­కి అలవాటుగా మారిపోయింది. మేక మద్యం తాగుతుండటాన్ని పలువురు ఆసక్తిగా గమనిస్తున్నారు. 

మరిన్ని వార్తలు