Mancherial: దవాఖానాలో పాముల హల్‌చల్‌.. పారిశుద్ధ్య పనులు చేస్తుండగా..

18 Jul, 2022 17:19 IST|Sakshi

సాక్షి, మంచిర్యాల: భారీ వర్షాలు, వరదలతో తల్లడిల్లుతున్న ముంపు ప్రాంత ప్రజలను చీడపీడలు దడపుట్టిస్తున్నాయి. పరిసర ప్రాంతాలు జలమయం కావడం, చుట్టూరా చలి వాతావరణం నెలకొనడంతో పాములు, తేళ్లు ఇళ్లల్లోకి, ఆఫీసుల్లోకి చొరబడుతున్నాయి. తాజాగా మంచిర్యాల జిల్లా కేంద్రంలోని మాత శిశు ఆసుపత్రిలో పారిశుద్య కార్మికురాలు సునీత పాముకాటుకు గురయ్యారు.  

ఆసుపత్రికి వరద తాకిడికి గురికావడంతో ఆసుపత్రి ఆవరణలో పారిశుద్ధ్య పనులు చేస్తున్నారు. పనుల్లో సునీత కూడా పాల్గొన్నారు. అదే సమయంలో పాము కాటు వేయడంతో మంచిర్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం  ఆమె పరిస్థితి ఆందోళనకరంగా ఉందని డాక్టర్లు చెబుతున్నారు. సునీత అరోగ్యంపై కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు. కిటీకీ, ఫ్లోర్‌పై పాములు కదులుతున్న వీడియోలు వైరల్‌గా మారాయి. ఆపరేషన్‌ థియేటర్‌, దాని చుట్టుపక్కల పదుల సంఖ్యలో పాములు కనిపించాయని పారిశుద్ధ్య కార్మికులు చెప్పారు. వాటిని బయటకు తరిమేశామని వెల్లడించారు.

మరిన్ని వార్తలు