పత్తి ఏరాల్సిన చోట.. చేనులో చేపల వేట

30 Sep, 2021 08:16 IST|Sakshi
మంచిర్యాలలో నీటిలో మునిగిన పత్తి చేనులో చేపలు పడుతున్న మత్య్సకారుడు

ఇటీవల కురిసిన వర్షాలకు మంచిర్యాల జిల్లాలో గోదావరి పరవళ్లు తొక్కుతోంది. ఎగువ ప్రాంతాల నుంచి భారీగా వరద వస్తుండడంతో నదీ పరివాహక ప్రాంతాల్లో ఉన్న పంట చేలలోకి వరద నీరు చేరింది. గోదావరి నదిలో వరద ఉధృతి ఎక్కువగా ఉండడంతో బుధవారం చేపల వేటకు అధికారులు అనుమతించలేదు. అయితే కొందరు మత్య్సకారులు నీరు నిలిచిన పొలాల్లో చేపల వేట కొనసాగించడం ఆసక్తికరంగా మారింది. పరివాహక ప్రాంతంలోని పంట చేలలో వరద నీటిపై తెప్పలు వేసుకుని వెళ్లి మత్య్సకారులు చేపలు పట్టారు. తమ రెక్కల కష్టం వరద పాలైందని రైతులు వాపోతున్నారు. పంట నష్టం జరిగిన పొలాలకు ప్రభుత్వం పరిహారం ఇవ్వాలని రైతులు డిమాండ్‌ చేశారు. పత్తి ఏరాల్సిన చోట చేపలు పట్టడం వింతగా ఉంది.
- సాక్షి ఫొటోగ్రాఫర్, మంచిర్యాల

మరిన్ని వార్తలు