గౌరవెల్లి భూనిర్వాసితుడి ఆత్మహత్యాయత్నం.. వాయిస్‌ రికార్డు చేసి సోషల్‌ మీడియాలో పోస్ట్‌

19 Jun, 2022 10:58 IST|Sakshi

నంగునూరు/అక్కన్నపేట (సిద్దిపేట): గౌరవెల్లి ప్రాజెక్ట్‌ నిర్మాణంతో నిర్వాసితుడైన ఓ యువకుడు ఆర్‌ అండ్‌ఆర్‌ ప్యాకేజీ రావడం లేదన్న మనస్థాపంతో పురుగు మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. శనివారం సిద్దిపేట జిల్లా నంగునూరు మండలం సిద్ధన్న పేటలో ఈ ఘటన చోటు చేసుకుంది.  అక్కన్నపేట మండలం గుడాటి పల్లి గ్రామానికి చెందిన బద్దం మల్లారెడ్డి, సరళ దంపతులకు 5 ఎకరాల వ్యవసాయ భూమి ఉంది. గౌరవెల్లి ప్రాజెక్ట్‌ నిర్మా ణంలో భాగంగా భూమి, ఇల్లు పోతుందని తెలియడంతో మల్లారెడ్డి మూడు సంవత్సరాల కిందట అత్తగారి ఊరైన సిద్ధన్నపేటకు వచ్చి స్థిరప డ్డారు.

ప్రభుత్వం నష్ట పరిహారం అంద జేయ డంతో ఇక్కడే వ్యవసాయ భూమి, ఇంటి స్థలం కొనుగోలు చేసి ఇల్లు నిర్మిం చుకున్నారు. కొన్ని రోజులు గా గుడాటిపల్లిలో నిర్వాసితుల నిర సన కార్యక్రమాలు జరుగుతుం డటంతో మల్లారెడ్డితో పాటు అతని కుమారుడు రాజిరెడ్డి కూడా పాల్గొంటున్నాడు. రాజిరెడ్డి మేజర్‌ కావడంతో ఆర్‌అండ్‌ఆర్‌ ప్యాకేజీలో తనకూ ఇల్లు వస్తుందని ఆశతో ఉన్నాడు. వారం రోజులు గడిచినా ఏ విషయం తేలక పోవడంతో శనివారం పురుగు మందు తాగా డు. దీనిపై వాయిస్‌ రికార్డు చేసి సోషల్‌ మీడి యాలో పోస్ట్‌ చేశాడు. ఇది చూసిన గ్రామ స్తులు రాజిరెడ్డిని వెంటనే సిద్దిపేట ఏరియా ఆస్పత్రికి తరలించారు.

మరిన్ని వార్తలు