కారు బోల్తా.. తెలంగాణ ప్రభుత్వ విప్‌ అడ్లూరి లక్ష్మణ్‌కు గాయాలు

19 Feb, 2024 06:36 IST|Sakshi

సాక్షి, జగిత్యాల: తెలంగాణ ప్రభుత్వ విప్‌, ధర్మపురి ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్‌ కుమార్‌ ప్రమాదానికి గురయ్యారు. ఎండపల్లి మండలం అంబారిపేట వద్ద ఆయన ప్రయాణిస్తున్న కారు బోల్తా పడింది. ఎదురుగా వస్తున్న లారీని తప్పించబోయే క్రమంలో ఈ ప్రమాదం జరిగింది.

ఈ ఘటనలో లక్ష్మణ్‌ కుమార్‌తో పాటు కారులో ఉన్న ఇతరులకు స్వల్ప గాయాలు అయ్యాయి. గాయపడిన వారిని కరీంనగర్‌కు తరలించి చికిత్స అందిచగా.. అడ్లూరిని మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్‌ యశోద ఆస్పత్రికి తరలిస్తున్నట్లు సమాచారం.

whatsapp channel

మరిన్ని వార్తలు