మంచి బతుకునిచ్చే.. బతుకమ్మ 

9 Oct, 2021 02:14 IST|Sakshi

గవర్నర్‌ తమిళిసై సౌందర రాజన్‌ వెల్లడి 

తెలుగు వర్సిటీలో బతుకమ్మ వేడుకలు  

హాజరైన గవర్నర్‌ తమిళిసై, ఎమ్మెల్సీ కవిత  

నాంపల్లి(హైదరాబాద్‌)/సాక్షి, హైదరాబాద్‌: పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయంలో శుక్రవారం బతుకమ్మ వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ వేడుకలను రాష్ట్ర గవర్నర్‌ తమిళిసై సౌందర రాజన్‌ ముఖ్యఅతిథిగా హాజరై ప్రారంభించారు.  ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితతో కలసి బతుకమ్మను ఆడారు. అం తకు ముందు ఎన్‌టీఆర్‌ కళామందిరంలో పొట్టి శ్రీరాములు తెలుగు వర్సిటీ ఉపాధ్యక్షుడు ఆచార్య తంగెడు కిషన్‌రావు అధ్యక్షతన సమావేశం జరిగింది.

ఈ సభలో గవర్నర్‌ ‘అందరికి నమస్కారం’అంటూ ప్రసంగాన్ని తెలుగులో ప్రారంభించారు. ఈ సందర్భంగా తెలుగు ప్రజలకు నవరాత్రి, బతుకమ్మ శుభాకాంక్షలు తెలియజేశారు. మంచి బతుకును ఇచ్చే దేవత బతుకమ్మ అని అభివర్ణించారు. బతుకమ్మ పాటల్లో  పదాలపై పరిశోధన జరగాలని, జాగృతి సంస్థ ఇలాంటి ప్రయో గం చేస్తున్నట్లు ఎమ్మెల్సీ కవిత వివరించారు. ఈ కార్యక్రమంలో రిజిస్ట్రార్‌ ఆచా ర్య భట్టు రమేష్, విస్తరణల సేవా విభా గం ఇన్‌చార్జీ రింగు రామ్మూర్తి పాల్గొన్నారు.  

రాజ్‌భవన్‌లోనూ... 
రాజ్‌భవన్‌లోని దర్బార్‌హాల్‌లో శుక్రవారం రాష్ట్ర గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ బతుకమ్మ ఆడారు. ఇందులో జీహెచ్‌ఎంసీ మేయర్‌ విజయలక్ష్మితో పాటు పలు రంగాల్లోని మహిళలు పాల్గొన్నారు.   

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు