ఘనంగా రామయ్య పట్టాభిషేకం

12 Apr, 2022 03:19 IST|Sakshi
పట్టాభిషేక మహోత్సవం నిర్వహిస్తున్న అర్చకులు 

పట్టువస్త్రాలు సమర్పించిన గవర్నర్‌ తమిళిసై

ప్రజలు సంతోషంగా ఉండాలని ప్రార్థించినట్లు వెల్లడి

గవర్నర్‌ పర్యటనకు దూరంగా ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు

మూకుమ్మడిగా సెలవు పెట్టిన జిల్లా కలెక్టర్, ఎస్పీ, ఐటీడీఏ పీఓ  

సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం/భద్రాచలం: భద్రాద్రి రామయ్య పట్టాభిషేక మహోత్సవం సోమవారం ఘనంగా జరిగింది. మిథిలా స్టేడియం లోని కల్యాణ మండపంలో సీతమ్మవారితో సింహాసనంపై ఆసీనులైన రామయ్యను చూసి భక్తులు తరించారు. ఈ వేడుకకు గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ హాజరై ప్రభుత్వం తరఫున స్వామి వారికి పట్టువస్త్రాలు సమర్పించారు. అంతకుముందు ఆ మె రామాలయంలో స్వామివారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. పట్టాభిషేకం పూర్తయ్యాక భద్రాచలంలో వనవాసీ కళ్యాణ పరిషత్‌ ఆధ్వర్యంలో జరిగిన గిరిజన గర్భిణుల సీమంతం కార్యక్రమంలో తమిళిసై పాల్గొన్నారు.  

నేడు కొండరెడ్లతో ముఖాముఖి 
సోమవారం సాయంత్రం దమ్మపేట మండలం నా చారం గ్రామంలో గుట్టపై ఉన్న స్వయంభూ శ్రీ జగదాంబ సమేత జయలింగేశ్వర స్వామి ఆలయా న్ని దర్శించుకున్న తమిళిసై... మంగళవారం దమ్మ పేట మండలం పూసుకుంట, అశ్వారావుపేట మం డలం గోగులపూడి, రెడ్డిగూడెం గ్రామాలకు చెందిన వెనుకబడిన వందకుపైగా కొండరెడ్ల కుటుంబాల తో పూసుకుంటలో ముఖాముఖి నిర్వహించనున్నారు. 10 నెలల క్రితమే గవర్నర్‌ ఈ 3 గ్రామాలను దత్తత తీసుకొని గిరి వికాస్, గిరి పోషణ్‌  పథకాలతో వారికి పౌష్టికాహారం అందించడంతోపాటు కోళ్లు పంపిణీ చేస్తున్నారు. సోమవారం ఉదయం స్థానిక బీజేపీ నాయకులు గవర్నర్‌ను కలి సేందుకు సింగరేణి గెస్ట్‌హౌస్‌కు రాగా బిజీ షెడ్యూల్‌ ఉందం టూ తమిళిసై సున్నితంగా తిరస్కరించారు. 

మరిన్ని వార్తలు