అన్ని కాలేజీల్లో సీపీఆర్‌ శిక్షణ ఇవ్వాలి: గవర్నర్‌

3 Feb, 2023 02:57 IST|Sakshi
సీపీఆర్‌ చేసి చూపిస్తున్న గవర్నర్‌ తమిళిసై సౌందర్‌ రాజన్‌ 

పంజగుట్ట(హైదరాబాద్‌): కార్డియోపల్మనరీ రిససిటేషన్‌ (సీపీఆర్‌) శిక్షణను ఒక జీవితాన్ని కాపాడే మంచిపనిగా గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ అభివర్ణించారు. విదేశాల్లో 60 నుంచి 65 శాతం సీపీఆర్‌ శిక్షణ పొందిన వారుంటే భారత్‌లో కేవలం 2 శాతం ఉండటం బాధాకరమన్నారు. ప్రతీ కాలేజీలో సీపీఆర్‌ శిక్షణ ఇచ్చి సర్టిఫికెట్‌ ఇచ్చేలా చర్యలు తీసుకోవాలని పిలుపునిచ్చారు.

గురువారం రాజ్‌భవన్‌ సంస్కృతిహాల్లో గాంధీ మెడికల్‌ కాలేజీ పూర్వ విద్యార్థుల అసోసియేషన్, గాంధీ మెడికల్‌ కాలేజీ గ్లోబల్‌ అలయన్స్, అమెరికన్‌ హార్ట్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో ‘కమ్యూనిటీ హ్యాండ్స్‌ ఓన్లీ సీపీఆర్‌’పేరుతో రాజ్‌భవన్‌ సిబ్బందికి, వారి కుటుంబసభ్యులకు సీపీఆర్‌ శిక్షణా కార్యక్రమం నిర్వహించారు. గవర్నర్‌ ముఖ్యఅతిథిగా పాల్గొన్న ఈ ఈ కార్యక్రమంలో అమెరికన్‌ హార్ట్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు డాక్టర్‌ రాజశేఖర్, గాంధీ మెడికల్‌ కాలేజీ పూర్వ విద్యార్ధుల సంఘం అధ్యక్షుడు డాక్టర్‌ లింగమూర్తి పాల్గొన్నారు. 

మరిన్ని వార్తలు