విద్యార్థుల సమస్యలపై చర్చ
సాక్షి, హైదరాబాద్: ‘చాన్స్‌లర్ కనెక్ట్స్ అల్యూమినీ’ కార్యక్రమంలో భాగంగా గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ సోమవారం రాష్ట్ర విశ్వవిద్యాలయాల అధికారులు, ప్రముఖ విద్యావేత్తలతో సమావేశమవుతారు. రాజ్‌భవన్ కమ్యూనిటీ హాల్‌లో ఉదయం 9.30 గంటలకు జరగనున్న ఈ కార్యక్రమంలో విద్యార్థుల సమస్యలపై గవర్నర్ వర్సిటీ అధికారులతో చర్చించనున్నారు.
సుదీర్ఘ కాలంగా పెద్ద సంఖ్యలో బోధన, బోధనేతర సిబ్బంది పోస్టులు ఖాళీగా ఉండడంతో చాలా వర్సిటీల్లో పలు రకాల కోర్సులు మూతబడడం, ఫీజులను అడ్డగోలుగా పెంచడం, తరగతుల నిర్వహణ జరగకపోవడం, కొత్త విద్యా సంవత్సరం ప్రారంభమై 5 నెలలు గడుస్తున్నా ఇంకా కొన్ని వర్సిటీల్లో గత విద్యా సంవత్సరం చివరి సెమిస్టర్ పరీక్షలు జరగకపోవడం, రాజకీయాలతో వర్సిటీల పాలన వ్యవహారాలు పూర్తిగా గాడి తప్పడం వంటి అంశాలు చర్చకు వచ్చే
అవకాశం ఉంది.