సర్దార్‌ పటేల్‌కు గవర్నర్‌ నివాళి 

1 Nov, 2021 01:52 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: దివంగత తొలి ఉపప్ర ధాని సర్దార్‌ వల్లభాయ్‌ పటేల్‌ జయంతి సందర్భంగా గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ ఆదివారం ఆయనకు ఘనంగా నివాళులర్పించారు. ఉక్కు మనిషిగా పేరొందిన వల్లభాయ్‌ పటేల్‌ సంస్థానాల విలీనానికి, ఏకీకృత భారతావనిని నెలకొల్పడంలో చేసిన కృషి దేశ చరిత్రలో ఎనలేనిదని గవర్నర్‌ కొనియాడారు.

పటేల్‌ జయంతిని జాతీయ ఐక్యతా దినోత్సవంగా జరుపుకుంటున్న సందర్భంగా రాజ్‌భవన్‌లోని దర్బార్‌ హాల్‌లో జరిగిన ప్రత్యేక కా ర్యక్రమంలో రాజ్‌భవన్‌ అధికారులు, సి బ్బందితో గవర్నర్‌ రాష్ట్రీయ ఏక్తా దివస్‌ ప్రతిజ్ఞ చేయించారు. అంతకుముందు లక్డీకాపూల్‌ వద్ద ఉన్న పటేల్‌ విగ్రహానికి తమిళిసై పూలమాల వేసి నివాళులర్పి ంచారు. ​

మరిన్ని వార్తలు