పాస్‌పోర్టు కార్యాలయానికి గవర్నర్‌ తమిళిసై 

20 Sep, 2022 03:14 IST|Sakshi

రాంగోపాల్‌పేట్‌ (హైదరాబాద్‌): రాష్ట్ర గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ సోమవారం సికింద్రాబాద్‌లోని పాస్‌పోర్టు కార్యాలయానికి వచ్చారు. ఈ సందర్భంగా ఆమెకు ప్రాంతీయ పాస్‌పోర్టు అధికారి దాసరి బాలయ్య, ఉన్నతాధికారులు స్వాగతం పలికారు. దౌత్యపరమైన పాస్‌పోర్టు కోసం గవర్నర్‌ దరఖాస్తు చేశారు.

అధికారులు ఆమె బయోమెట్రిక్‌ వివరాలు సేకరించారు. అనంతరం గవర్నర్‌ పాస్‌పోర్టు అధికారులు, సిబ్బందితో కొద్దిసేపు ముచ్చటించారు. వారితో ఫొటోలు దిగి వెళ్లిపోయారు. త్వరలో ఆమె యూరోప్‌ దేశాల పర్యటనకు వెళుతుండటంతో దౌత్యపరమైన పాస్‌పోర్టు కోసం దరఖాస్తు చేసుకున్నట్లు తెలుస్తోంది.  

మరిన్ని వార్తలు