వర్క్‌ ఫ్రం.. వెడ్డింగ్‌!

25 Jul, 2021 02:12 IST|Sakshi

వర్క్‌ ఫ్రం హోం మనకు తెలిసిందే.. ఇక్కడ జరుగుతోంది.. వర్క్‌ ఫ్రం వెడ్డింగ్‌.. ఇది ఏదో సరదాకు చేసిన వీడియో కాదు.. నిజమే.. ఇన్‌స్టాగ్రాంలో దుల్హనియా అనే వెడ్డింగ్‌ పేజీ నిర్వాహకులు దీన్ని పోస్ట్‌ చేశారు. జీవితంలో చాలా అమూల్యమైన క్షణం వివాహం.. అలాంటిది ఆ టైంలో అర్జెంట్‌ మీటింగ్‌ అని అంటే.. ఎంత కష్టమో ఆలోచించండి.. తప్పనిసరి పరిస్థితుల్లో వరుడు ఇలా ల్యాప్‌టాప్‌ ముందేసుకుని.. సమావేశానికి హాజరయ్యాడు.. ఇటు వరుడు సీరియస్‌గా మీటింగ్‌లో ఉంటే.. అటు వధువు దీన్ని చూస్తూ.. గట్టిగా నవ్వుతూ కనిపించింది. ఈ వీడియోను చూసినోళ్లంతా తెగ ఎంజాయ్‌ చేసున్నారు.

మరిన్ని వార్తలు