బీఆర్‌ఎస్‌ పార్టీతో పొత్తుకు కాంగ్రెస్‌ అంగీకారం: గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి

6 Jan, 2023 18:26 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ ప్రజలు కేసీఆర్‌ ప్రభుత్వం పట్ల తీవ్ర విముఖత చూపుతున్నారని బీజేపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి అన్నారు. ప్రత్యామ్నాయ పార్టీగా ప్రజలంతా బీజేపీ వైపు చూస్తున్నారని చెప్పారు. ఈ మేరకు ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్‌ బీఆర్‌ఎస్‌ పార్టీతో పొత్తుకు అంగీకారం తెలిపిందని వార్తలు వస్తున్నాయి. ఇదే విషయాన్ని మేము ఎప్పుడో చెప్పాం. అధికారం కోసం వాళ్లిద్దరూ ఒక్కటవ్వడం ఖాయమన్నారు.

ఎమ్మెల్యేలు పార్టీ మార్పుపై కాంగ్రెస్‌ పరిస్థితి దొంగలు పడ్డ ఆరు నెలలకు కుక్కలు మొరిగినట్లు ఉందన్నారు. శనివారం రోజున రాష్ట్రంలోని 119 అసెంబ్లీ నియోజకవర్గాల్లో పోలింగ్‌ బూత్‌ కమిటీ సభ్యుల సమ్మేళనం ఉంటుందన్నారు. ఈ సమ్మేళనాన్ని ఉద్దేశించి జేపీ నడ్డా, బండి సంజయ్‌, కిషన్‌ రెడ్డి, డీకే అరుణ, డాక్టర్‌ లక్ష్మణ్‌ ప్రసంగిస్తారని చెప్పారు. 

చదవండి: (ఎమ్మెల్యేల కొనుగోలు కేసు.. హైకోర్టు కీలక వ్యాఖ్యలు)

మరిన్ని వార్తలు