నర్సాపూర్‌: సీఎం కేసీఆర్‌ సభలో బుల్లెట్ల కలకలం

16 Nov, 2023 21:17 IST|Sakshi

సాక్షి, నర్సాపూర్‌: సీఎం కేసీఆర్‌ సభలో బుల్లెట్లు కలకలం రేపాయి. అస్లాం అనే వ్యక్తి దగ్గర నుంచి 2 బుల్లెట్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నిందితుడు అస్లాంను పోలీసులు ప్రశ్నిస్తున్నారు.

ఎన్నికల ప్రచారంలో భాగంగా మెదక్‌ జిల్లా న‌ర్సాపూర్ నియోజ‌క‌వ‌ర్గంలో ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద స‌భ‌లో ముఖ్యమంత్రి కేసీఆర్ పాల్గొని ప్రసంగించారు. కేసీఆర్ ప్రసంగం కొనసాగుతుండగా అనుమానాస్పదంగా తిరుగుతున్న అస్లాం అనే వ్యక్తిని అదుపులోకి తీసుకున్న పోలీసులు.. అతని వద్ద నుంచి రెండు బుల్లెట్లను స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసిన పోలీసులు.. అస్లాంను విచారిస్తున్నారు.
చదవండి: దమ్ముంటే అక్కడ గెలవండి! చిదంబరానికి మంత్రి హరీష్‌ రావు కౌంటర్‌

మరిన్ని వార్తలు