గురుకులాలది తలోదారి

29 Jul, 2020 12:57 IST|Sakshi
బోసిపోతున్న గురుకుల పాఠశాల

కొన్నిచోట్ల టీవీ పాఠాలు

మరికొన్ని చోట్ల ఆన్‌లైన్‌ తరగుతుల నిర్వహణ  

గందరగోళంలో తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు

బోధన విషయంలో ఒక్కో గురుకులం ఒక్కో విధంగా సాగుతున్నాయి. ఎస్సీ గురుకులాల్లో వీడియోలు రూపొందించి వాట్సాప్‌ ద్వారా పంపిస్తున్నారు. మైనారిటీ, బీసీ గురుకులాల్లో జూమ్‌ యాప్‌ ద్వారా తరగతులు నిర్వహిస్తున్నారు.

బాన్సువాడ రూరల్‌:  నలుదిక్కులా కరోనా మేఘాలు కమ్ముకున్న ప్రస్తుత తరుణంలో విద్యార్థుల చదువులు అగమ్యగోచరంగా మారాయి. కరోనా కరుణ చూపే వరకు పాఠశాలల పున:ప్రారంభం కత్తిమీద సాము లాగే తయారైంది. తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, మేధావులు కూడా ఇప్పటికిప్పుడే పాఠశాలలను పున:ప్రారంభించరాదని సూచించారు. పరీక్షలు నిర్వహిస్తే ఎక్కడ కరోనా విస్తరిస్తుందోననే భయంతో ప్రభుత్వం ఇప్పటికే గతేడాది ఒకటో తరగతి నుంచి  పదో తరగతి వరకు పరీక్షలు లేకుండానే విద్యార్థులందరిని పాస్‌ చేసేసింది. ఇదిలా ఉండగా ఈసారి ఇటు విద్యా సంవత్సరం నష్టపోకుండా, అటు విద్యార్థులు చదువులకు దూరం కాకుండా ప్రభుత్వం నష్టనివారణ చర్యలు చేపడుతోంది. మొదట ఆన్‌లైన్‌ విద్యాబోధన చేయాలనుకున్న ప్రభుత్వం విద్యార్థులందనికీ వద్ద స్మార్ట్‌ ఫోన్, ఇంటర్నెట్‌ సౌకర్యం ఉండదని భావించి దూరదర్శన్‌ ద్వారా విద్యార్థుల స్వీయ అధ్యయానికి అనుమతించింది. దీనిలో భాగంగా  తెలంగాణాలో డీడీగిరి చానల్‌ ద్వారా విద్యార్థులకు పాఠ్యాంశాలను బోధిస్తున్నారు. గత వారం నుంచి ఈ బోధన ప్రక్రియ ప్రారంభం కాగా విద్యార్థులు ఇంటివద్దనే ఉంటూ పాఠ్యాంశాలను నేర్చుకుంటుంన్నారు. ఒ

క్కోచోట.. ఒక్కోరకంగా..
బోధనలో టీవీ పాఠాలకే ప్రభుత్వం ప్రాధాన్యత ఇవ్వాల్సిందిగా సూ చించినప్పటికీ గురుకుల సొసైటీ లు మాత్రం తమకు తోచిన పద్ధతిని అవలంభిస 
ఎస్సీ, ఎస్టీ గురుకుల పాఠశాలల్లో చదువుకునే విద్యార్థులకు ఉపాధ్యాయులు రూపొందించిన వీడియో పాఠాలను వాట్సాప్‌ ద్వారా చేరవేస్తున్నారు. అలాగే విలేజ్‌ లర్నింగ్‌ సర్కిల్స్‌ పేరుతో ఉపాధ్యాయులు, పూర్వ విద్యార్థులు, సీనియర్‌ విద్యార్థులు స్థానికంగా 10నుంచి 15మంది విద్యార్థులను సమీకరించి పాఠాలు బోధిస్తున్నారు. 
మైనార్టీ గురుకుల పాఠశాలల్లో మాత్రం సొసైటీ రూపొందించిన షెడ్యూల్‌ ప్రకారం ఉపాధ్యాయులు విద్యార్థులకు జూమ్‌ యాప్‌ ద్వారా విద్యాబోధన చేస్తున్నారు. చాలా మంది తల్లిదండ్రుల వద్ద స్మార్టు ఫోన్‌లు లేకపోవడం సిగ్నల్‌ సమస్యతో సగానికి పైగా విద్యార్థులు చదువులకు దూరం అవుతున్నారు. 
బీసీ గురుకుల పాఠశాలల్లో కేవలం పదో తరగతి విద్యార్థులకు మాత్రమే జూమ్‌ యాప్‌ ద్వారా ఆన్‌లైన్‌ విద్యాబోధన కొనసాగుతుంది. మిగిలిన క్లాసులకు కూడా ఆన్‌లైన్‌ తరగతులను విస్తరించాలని భావిస్తున్నారు. 
ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు మాత్రం దూరదర్శన్‌ యాదగిరి ఛానల్‌ ద్వారానే స్వీయ అధ్యయనానికి ఉపాధ్యాయులు పురమాయిస్తున్నారు.

డీడీ చానల్‌లో తరగతుల వేళలు
1, 2 తరగతుల వారికి ఉదయం 11గంటల నుంచి 12గంటల వరకు.. 
3, 4, 5 తరగతుల వారికి ఉదయం12గంటల నుంచి ఒంటి గంట వరకు.. 
6, 7 తరగతులకు మధ్యాహ్నం 2నుంచి 3గంటల వరకు.. 
8,9 తరగుతల వారికి మధ్యాహ్నం 3 నుంచి 4గంటల వరకు.. 
పదో తరగతి విద్యార్థులకు మాత్రం ఉదయం 10నుంచి 11గంటల వరకు అలాగే సాయంత్రం 4నుంచి 5గంటల వరకు 2గంటల పాటు పాఠాలు ప్రసారం కానున్నాయి.

మరిన్ని వార్తలు