కవితను పరిచయం చేసిన మండలి చైర్మన్‌ 

19 Mar, 2021 02:53 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: శాసనమండలిలో రాష్ట్ర వార్షిక బడ్జెట్‌ను గురువారం శాసనసభా వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి ప్రవేశపెట్టారు. 84 పేజీల బడ్జెట్‌ ప్రసంగ పాఠాన్ని దాదాపు గంటన్నరలో చదివారు. బడ్జెట్‌ ప్రసంగం ముగిశాక, స్థానిక సంస్థల నుంచి ఎన్నికై తొలిసారి మండలి సమావేశాలకు హాజరైన ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను.. చైర్మన్‌ గుత్తా సుఖేందర్‌రెడ్డి సభ్యులకు పరిచయం చేశారు. బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన మంత్రి వేములను, ఎమ్మెల్సీ కవితను పలువురు సభ్యులు అభినందించారు.

మరిన్ని వార్తలు