విషాదం: వైద్యం కోసం బస్సులో వెళ్తుండగా భార్య ఒడిలోనే..

26 Nov, 2022 02:37 IST|Sakshi
భార్య ఒడిలోనే.. ప్రాణాలు కోల్పోయిన తిరుపతిరెడ్డి. ఇన్‌సెట్లో తిరుపతిరెడ్డి (ఫైల్‌)

పరకాల: వైద్యం కోసం ఆర్టీసీ బస్సులో బయల్దేరిన ఒక డయాలసిస్‌ రోగి గుండెపోటుతో భార్య ఒడిలోనే కుప్పకూలాడు. ఈ విషాద సంఘటన హనుమకొండ జిల్లా పరకాల బస్టాండ్‌లో శుక్రవారం ఉదయం జరిగింది. జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలం చల్లగరిగె గ్రామానికి చెందిన అలిగేటి తిరుపతి రెడ్డి (44) కొంతకాలంగా వరంగల్‌లో డయాలసిస్‌ చేయించుకుంటున్నారు.

వైద్యం కోసం భార్య స్వప్నతో కలిసి వెంకట్రావుపల్లి నుంచి వరంగల్‌కు ఆర్టీసీ బస్సులో వస్తున్నారు. బస్సు పరకాల బస్టాండ్‌కు చేరుకున్న కాసేపటికే.. భార్య ఒడిలో గుండెపోటుతో కుప్పకూలిపోయారు. వైద్యం చేస్తే బతుకుతాడనుకున్న భర్త.. కన్ను మూయడంతో భార్య స్వప్న కన్నీరుమున్నీరుగా విలపించింది. (క్లిక్ చేయండి: సోదరులిద్దరికీ ఒకేసారి వివాహం.. పెళ్లైన ఆరు నెలలకే మృత్యుఒడికి)

మరిన్ని వార్తలు