వీడియో: హనుమకొండ ప్రసూతి ఆస్పత్రిలో మహిళా సిబ్బంది బర్త్‌డే పార్టీ

27 Oct, 2022 16:31 IST|Sakshi

సాక్షి, హన్మకొండ: జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ప్రసూతి ఆస్పత్రిలో మహిళా సిబ్బంది వ్యవహరించిన తీరుపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మందు పార్టీతో హల్ చల్ చేశారు వాళ్లు. ఏకంగా స్టాఫ్ రూమ్‌లో బీర్లు తాగుతూ చిలిపి చేష్టల విజువల్ ఇప్పుడు సోషల్ మీడియా వైరల్ గా మారాయి. వారం రోజుల క్రితం ఈ ఘటన చోటు చేసుకోగా.. వైరల్‌ వీడియో ద్వారా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. 

ఆరోగ్య శ్రీ ఉద్యోగి, ఒక స్టాప్ నర్స్ మరొక జీఎన్‌ఎం కలిసి మందు పార్టీ చేసుకున్నారు. ఆ సమయంలో వాళ్లు వెకిలి చేష్టలకు పాల్పడుతుండగా.. ఎవరో వీడియో తీశారో. కానీ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో వైద్యాధికారులు అప్రమత్తమయ్యారు.  విచారణకు ఆదేశించారు. ఆసుపత్రిలో వైద్య సేవలు అందించాల్సిన సిబ్బంది మందు పార్టీతో ఇలా వ్యవహరించడం పట్ల స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. హాస్పిటల్ను బార్ గా మార్చిన సిబ్బంది పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. 

హనుమకొండ ప్రసూతి ఆస్పత్రిలో మందు పార్టీపై స్పందించిన ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ విజయలక్ష్మి. ‘వారం రోజుల క్రితం జరిగిన ఘటన తమ దృష్టికి రాగానే పిలిచి మందలించాను.  స్టాప్ రూమ్ లో అలా చేయడం తప్పేనని సారీ చెప్పారంటున్న సూపరింటెండెంట్. మొదటి తప్పుగా భావించి మందలించి వదిలేశాము.ఇంకోసారి ఇలా జరిగితే సీరియస్ యాక్షన్ తీసుకుంటానని హెచ్చరించాను. బర్త్డే పార్టీ సందర్భంగా ఫ్రెండ్స్ తో పార్టీ చేసుకున్నామని వివరణ ఇచ్చారు’ అని తెలిపారు సూపరింటెండెంట్.

మరిన్ని వార్తలు