కొండగట్టు అంజన్న చినజయంతికి పోటెత్తిన భక్తజనం

17 Apr, 2022 02:01 IST|Sakshi

సాక్షి,కొండగట్టు (చొప్పదండి): జగిత్యాల జిల్లా మల్యాల మండలంలోని కొండగట్టు ఆంజనేయస్వామి సన్నిధానంకు లక్షలాది మంది భక్తులు, దీక్షాపరులు తరలిరావడంతో కాషాయమయమైంది. హనుమాన్‌ చినజయంతి సందర్భంగా తెలంగాణతోపాటు ఆంధ్ర, మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రాల నుంచి కూడా భక్తులు, దీక్షాపరులు తరలివచ్చారు. కొందరు పాదయాత్ర ద్వారా కొండగట్టుకు చేరుకున్నారు.

మరికొందరు సొంత వాహ నాలు, ఆర్టీసీ బస్సుల్లో తరలివచ్చారు. తొలుత కోనేటిలో స్నానాలు ఆచరించారు. తలనీలాలు సమర్పించి స్వామివారిని దర్శించుకున్నారు. ప్రత్యేక పూజలు చేశాక మాల విరమణ చేశారు. వీరికోసం ఆలయ కమిటీ ఆధ్వర్యంలో అన్ని ఏర్పాట్లు చేశారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.  

మరిన్ని వార్తలు