సహజ ప్రసవాలు పెంచండి

31 Jan, 2022 03:43 IST|Sakshi
సభలో మాట్లాడుతున్న మంత్రి హరీశ్‌రావు

వైద్యులకు మంత్రి హరీశ్‌ సూచన

పాశమైలారంలో త్వరలో 200 మెట్రిక్‌ టన్నుల ఆక్సిజన్‌ ప్లాంట్‌

జహీరాబాద్‌: రాష్ట్ర ప్రభుత్వం వైద్య రంగంలో గుణాత్మకమైన మార్పులను తీసుకొచ్చిందని రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు అన్నారు. ఆదివారం సంగారెడ్డి జిల్లా జహీరాబాద్‌ ఏరియా ప్రభుత్వాస్పత్రిలో మహీంద్ర ఆధ్వర్యంలో రూ.1.05 కోట్లతో ఏర్పాటుచేసిన ఆక్సిజన్‌ జనరేషన్‌ ప్లాంట్‌ను మంత్రి హరీశ్‌రావు ప్రారంభించారు. ఈ సందర్భంగా నిర్వహించిన సభలో ఆయన మాట్లాడుతూ, రాష్ట్రంలోని ప్రభుత్వాస్పత్రుల్లో ఇప్పటివరకు 86 ఆక్సిజన్‌ జనరేషన్‌ ప్లాంట్లు ఏర్పా టు చేసినట్టు తెలిపారు.

కరోనా సెకండ్‌ వేవ్‌లో ఆక్సిజన్‌ కోసం నానాకష్టాలు పడాల్సి వచ్చిందని, ఇది గమనించిన సీఎం కేసీఆర్‌ 550 మెట్రిక్‌ టన్నుల ఆక్సిజన్‌ ఉత్పత్తిని పెంచాలని ఆదేశించార న్నారు. ప్రస్తుతం 350 మెట్రిక్‌ టన్నుల ఉత్పత్తికి చేరుకున్నామని, మరో 200 మెట్రిక్‌ టన్నుల ఆక్సిజ న్‌ ఉత్పత్తికి పాశమైలారంలో ప్లాంట్‌ ఏర్పాటుచేసేం దుకు అగ్రిమెంట్‌ చేసుకున్నా మన్నారు. రాష్ట్రవ్యా ప్తంగా ఉన్న ప్రభుత్వాస్ప త్రుల్లోని 27 వేల పడక లకు ఆక్సిజన్‌ సౌకర్యం కల్పించామని, ఎలాంటి పరిస్థితి వచ్చినా ఆక్సిజన్‌ కొరత ఉండబోదని చెప్పారు.

కేసీఆర్‌ కిట్‌తో ప్రభుత్వ ఆస్పత్రుల్లో డెలివరీలు పెరిగాయని, ప్రస్తుతం 52 శాతం డెలివ రీలు జరుగుతున్నాయని, దీనిని 75 శాతానికి పెం చాలని వైద్యులకు సూచించారు. దేశంలో పేదలకు ఉత్తమ వైద్య సేవలు అందించే విషయంలో తెలంగాణ మూడోస్థానంలో ఉందని, త్వరలోనే మొదటి స్థానంలో నిలిచేలా కృషి చేస్తున్నామన్నారు. అనంత రం హోతి(బి) గ్రామంలో మాజీ మంత్రి ఎండీ ఫరీదుద్దీన్‌ ఫాతిహా చాహేలుమ్‌ కార్యక్రమంలో పాల్గొని ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు. ఆయన కుమారుడు తన్వీర్‌తో పాటు కుటుంబసభ్యులను పరామర్శించారు. 

మరిన్ని వార్తలు