పోరాటాల అడ్డా.. సిద్దిపేట గడ్డ 

11 Apr, 2021 11:29 IST|Sakshi

సిద్దిపేట తొలి ఎమ్మెల్యే గురువారెడ్డి విగ్రహావిష్కరణలో మంత్రి హరీశ్‌

సిద్దిపేట అర్బన్‌: ప్రత్యేక రాష్ట్రం కోసం జరిగిన తొలి, మలి విడత పోరాటాలకు సిద్దిపేట గడ్డ దిక్సూచిగా నిలి చిందని, అలాంటి గడ్డకు తొలి శాసనసభ్యుడిగా ప్రాతి నిధ్యం వహించిన ఎడ్ల గురువారెడ్డి విగ్రహాన్ని ఆవిష్క రించుకోవడం సంతోషంగా ఉందని ఆర్థిక మంత్రి హరీశ్‌రావు అన్నారు. శనివారం జిల్లా కేంద్రంలోని గాంధీ పార్కులో ఏర్పాటు చేసిన గురువారెడ్డి విగ్రహాన్ని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డితో కలిసి ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, కమ్యూనిస్టు నాయకుడిగా, శాసనసభ్యుడిగా గురువారెడ్డిది గొప్ప చరిత్ర అని, సిద్దిపేటకు మొట్టమొదట కరెంట్‌ను తీసుకొచ్చిన నాయకుడు అని కొనియాడారు. పోరాటాలు చేసిన వీరుల, నాయకుల విగ్రహాలు ఘనంగా ప్రతిష్టించుకున్న ఘనత సిద్దిపేటకే దక్కుతుందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి అన్నా రు. కార్యక్రమంలో ఐజేయూ జాతీయ అధ్యక్షుడు శ్రీనివాస్‌రెడ్డి, ఎమ్మెల్సీ రఘోత్తంరెడ్డి, జెడ్పీ చైర్‌పర్సన్‌ వేలేటి రోజాశర్మ, సీపీఐ జిల్లా కార్యదర్శి మంద పవన్, మున్సిపల్‌ చైర్మన్‌ రాజనర్సు, సుడా చైర్మన్‌ రవీందర్‌రెడ్డిలు పాల్గొన్నారు.

రూ.60 లక్షలతో కుక్కల కు.ని. కేంద్రం 
ప్రశాంత్‌నగర్‌ (సిద్దిపేట): సిద్దిపేటలో రూ.60 లక్షలతో వీధి కుక్కల జనన నియం త్రణ కేంద్రాన్ని నిర్మించామని ఆర్థిక మంత్రి హరీశ్‌రావు అన్నారు. శనివారం ఈ కేంద్రాన్ని ప్రారంభించిన అనంతరం ఆయన మాట్లాడుతూ, ఈ కేంద్రంలో ప్రతి రెండు రోజులకు ఒకసారి 240 కుక్కలకు ఆపరేషన్‌ చేసి, అవి కోలుకునే వరకు ఆహారం ఇవ్వడంతో పాటుగా రేబిస్‌ ఇంజక్షన్‌ ఇవ్వనున్నట్లు తెలిపారు.
చదవండి: బీజేపీ నేత ప్రకాష్‌ గౌడ్‌ మృతి

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు