బాబ్జీపై మంత్రి హరీశ్‌రావు ప్రశంసలు

5 Nov, 2020 16:04 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : ట్రాఫిక్‌లో చిక్కుకున్న అంబులెన్స్‌కు దారి క్లియర్‌ చేసి మాతవత్వం చాటుకున్న అబిడ్స్‌ ట్రాఫిక్‌ కానిస్టేబుల్‌ బాజ్జీకి అభినందనలు వెల్లువెత్తున్నాయి. ఇప్పటికే బాబ్జీపై నెటిజన్లు ప్రశంసలు జల్లు కురిపిస్తుండగా.. తాజాగా తెలంగాణ ఆర్థిక మంత్రి హరీశ్‌రావు ట్విటర్‌ వేదికగా బాబ్జీని అభినందించారు. ‘మానవత్వం పరిమళించే మంచి మనుషుల్ని చూసినప్పుడు గొప్ప సంతోషం కలుగుతుంది. ప్రాణాపాయ స్థితిలో ఉన్న రోగిన కాపాడటం కోసం హైదరాబాద్ అబిడ్స్ లో కానిస్టేబుల్ బాబ్జీ పడిన తపన చూసినప్పుడు అంతే సంతోషం వేసింది.ట్రాఫిక్ లో చిక్కుకుపోయిన అంబులెన్స్ ను ఆస్పత్రికి చేర్చిన తీరు అందరికీ ఒక ఆదర్శంగా నిలిచిపోతుంది. పోలీసు డిపార్టమెంట్ గర్వంగా ఫీలయ్యే గొప్ప పనిచేశావు.హ్యాట్సాఫ్ బాబ్జీ’ అంటూ హరీశ్‌రావు ట్వీట్‌ చేశారు. 
(చదవండి : పరిగెత్తాడు.. ఓ ప్రాణం రక్షించేందుకు దారిచ్చాడు)

కాగా, హైదరాబాద్ అబిడ్స్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ లో ట్రాఫిక్ కానిస్టేబుల్ గా పనిచేసే బాబ్జి.. నిత్యం రద్దీగా ఉండే మొజంజాహి మార్కెట్ నుండి కోఠి వెళ్లే దారిలో ఓ అంబులెన్స్‌ ట్రాఫిక్ లో చిక్కుకోవడం గమనించి, పరిగెడుతూ దారి క్లియర్ చేశాడు. దీంతో అంబులెన్స్‌ సకాలంలో ఆస్పత్రికి చేరడంతో అందులో ఉన్న వ్యక్తి ప్రాణాలతో బయటపడ్డారు. దీనికి సంబంధించిన వీడియో వైరల్‌ కావడంతో పోలీస్ ఉన్నతాధికారులతో పాటు నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా