గోవులను కాపాడాలి..

25 Jan, 2021 15:59 IST|Sakshi

ఆర్థిక శాఖ మంత్రి హరీష్‌రావు

సాక్షి, సంగారెడ్డి: దక్షిణ కాశీగా ప్రసిద్ధి చెందిన కేతకీ సంగమేశ్వర ఆలయాన్ని అన్ని విధాలుగా  అభివృద్ధి చేస్తామని ఆర్థిక శాఖమంత్రి హరీశ్‌రావు అన్నారు. సోమవారం  సంగారెడ్డి జిల్లాలో ఆయన పర్యటించారు. ఉదయం జహీరాబాద్‌ నియోజకవర్గంలోని ఝరాసంఘం మండలం కేతకీ సంగమేశ్వర దేవాలయంలో పూజలు నిర్వహించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈ ఆలయానికి నాలుగు రాష్ట్రాల నుండి భక్తులు దర్శనానికి వస్తున్నారన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ హయాంలో దేవాలయాల నిధులు.. ప్రభుత్వాలు వాడుకున్నాయని, కానీ ఇప్పుడు ప్రభుత్వ నిధులు ఆలయాలకు ఇస్తున్నామన్నారు. యాదాద్రి, వేములవాడ, భద్రాద్రి ఆలయాల అభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. చదవండి: తెలంగాణకు రూ.1,336 కోట్లు.. ఏపీకి రూ.1,810 కోట్లు

దేవాలయాల్లో పని చేసే అర్చకులకు ఏడాదకి రూ.110 కోట్లు జీతాలు ఇస్తున్నామని ఆయన పేర్కొన్నారు. రాష్ట్రంలో హిందూ ధర్మ పరిరక్షణకు ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా జహీరాబాద్‌కి నీళ్లు ఇమ్మని త్వరలో ముఖ్యమంత్రిని కలుస్తామన్నారు. వైశ్యులకు ముఖ్యమంత్రి సముచిత స్థానం కల్పిస్తున్నారన్నారు. రాష్ట్రంలో త్వరలో​ పెద్ద ఎత్తున ఉద్యోగ నియామకాలు జరుగుతాయన్నారు. గోవులను కాపాడాలి, నిత్యం పూజించాలి మంత్రి పిలుపునిచ్చారు. సీఎం వైశ్యులు కి సముచిత స్థానం కల్పిస్తున్నారు. త్వరలో పెద్ద ఎత్తున ఉద్యోగ నియామకాలు జరుగుతాయన్నారు. గోవులను కాపాడాలని, నిత్యం పూజించాలని మంత్రి హరీశ్‌రావు పిలుపునిచ్చారు. చదవండి: కరోనా వ్యాక్సిన్‌ వేసుకున్న తొలి ఎమ్మెల్యే

మరిన్ని వార్తలు