పేదల నడ్డి విరుస్తోన్న బీజేపీ

24 Sep, 2021 02:32 IST|Sakshi

పథకాలతో డబ్బులు ఇచ్చేది టీఆర్‌ఎస్‌.. గుంజుకునేది బీజేపీ: హరీశ్‌రావు

ఇల్లందకుంట (హుజూరాబాద్‌): ప్రధానమంత్రి సొంత రాష్ట్రమైన గుజరాత్‌లో ఇస్తున్న పింఛన్‌కన్నా మూడు రెట్లు ఎక్కువగా తెలంగాణలో ఇస్తున్నామని ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు అన్నారు. కరీంనగర్‌ జిల్లా ఇల్లందకుంట మండల కేంద్రంలో గురువారం స్వయం సహాయక సంఘా లకు 3.14 కోట్ల వడ్డీ లేని రుణాలను పంపిణీ చేశా రు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, బీజేపీ పాలిత రాష్ట్రాలలో 2 వేల పెన్షన్‌ అమలు చేస్తున్నా రా అని ప్రశ్నించారు.

పేదోడికి టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం పథకాలు రూపొందించి డబ్బులు ఇస్తుంటే.. కేంద్రంలోని బీజేపీ మాత్రం ధరలు పెంచుతూ ప్రజల నడ్డి విరుస్తోందన్నారు. పన్నులు విధించే బీజేపీ వైపు ఉంటారా? ప్రజల అవసరాలు తీర్చే టీఆర్‌ఎస్‌ వైపు ఉంటారా అన్నది ప్రజలు ఆలోచించుకోవాలని సూచించారు. ఇల్లందకుంట మండలంలోని 682 సహాయక సంఘాలకు 3.14 కోట్ల రుణాలు, స్త్రీనిధి కింద రూ.1.30 కోట్ల వడ్డీ లేని రుణాలు ఇస్తున్నామని తెలిపారు.

మండలంలోని 18 పంచాయతీలకుగాను 18 మహిళా సంఘ భవనాలకు 2.36 కోట్లు కేటాయిస్తున్నట్లు పేర్కొన్నా రు. మండల సమాఖ్యకు మరో 70 లక్షలు కేటా యించి, నాలుగు నెలలలోపే పూర్తి చేసేలా చర్యలు తీసుకుంటామన్నారు. 17 ఏళ్ళు ఎమ్మెల్యేగా, మంత్రిగా ఉండి ఒక్క సంఘ భవనం కూడా కట్టించలేదని, అలాంటి వ్యక్తికి ఓటు వేస్తే నిరుపయోగమని విమర్శించారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి, జెడ్పీ చైర్‌పర్సన్‌ కనుమల్ల విజయ, ఎమ్మెల్యే సుంకె రవిశంకర్, సుడా చైర్మన్‌ జీవీ రామకృష్ణారావు పాల్గొన్నారు.  

మరిన్ని వార్తలు