Vibes Of Siddipet: ‘వైబ్స్‌ ఆఫ్‌ సిద్దిపేట’కు నెటిజన్స్‌ ఫిదా..

21 Aug, 2021 15:57 IST|Sakshi
ట్విట్టర్‌లో మంత్రి హరీశ్‌రావు పోస్ట్‌ చేసిన ఫొటో

మధ్యలో నిండా నీటితో పిల్ల కాలువ... చుట్టూ హరితం పరుచుకున్నట్లు చెట్లు. ఆహ్లాదభరితంగా కనిపిస్తున్న దృశ్యాలు మన తెలంగాణ రాష్ట్రంలోనివే. అదీ ఏ గ్రామీణ ప్రాంతమో కాదు.. పట్టణ ప్రాంతం అంటే ఆశ్చర్యం కలుగకమానదు. ఈ చిత్రాలు తీసింది ఎవరో కాదు.. తెలంగాణ ఆర్థిక మంత్రి హరీశ్‌రావు. సిద్దిపేట పట్టణ సమీపంలోని తేజోవనం(అర్బన్‌ పార్క్‌)లో ఈ చిత్రాలను శుక్రవారం ఆయన ఫోన్‌లో బంధించారు.

‘వైబ్స్‌ ఆఫ్‌ సిద్దిపేట’ శీర్షికకు సంతోషాన్ని సూచించే బ్లూ లవ్‌ సింబల్‌ జోడించి ట్విట్టర్‌లో పోస్ట్‌ చేశారు. వర్షాకాలంలో సిద్దిపేట ప్రకృతి సౌందర్యానికి ప్రతీకలుగా ఉన్న ఫొటోలు నెటిజన్లు, ప్రకృతి ప్రేమికులను విశేషంగా ఆకర్షిస్తున్నాయి. ప్రకృతి అందాల ఫొటోలు బాగున్నాయి అంటూ కొందరు.. హరీశ్‌ కృషి ఫలితమే ఇది అని మరికొందరు నెటిజన్లు అభినందిస్తున్నారు. (చదవండి: లోటస్‌పాండ్‌కు కొత్త శోభ.. మంత్రముగ్ధుల్ని చేస్తున్న దృశ్యాలు)
– సాక్షి, సిద్దిపేట

ఏడాది క్రితం నాటిన చెట్లు ఎలా పెరిగాయో తెలుపుతూ ట్వీట్టర్‌లో ఫొటో షేర్‌ చేసిన మంత్రి హరీష్ రావు

సిద్దిపేట శివారులోని రంగనాయక సాగర్ అందాలు

మరిన్ని వార్తలు